రష్యాకు చెందిన రెండు సుఖోయ్ Su-27s ( Sukhoi Su-27s) యుద్ధ విమానాలను ఫిన్‌లాండ్‌కి చెందిన F/A-18C హార్నెట్ యుద్ధ విమానం అడ్డుకోవడం ఆ రెండు దేశాల మధ్య ఒకింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జూలై 28న రష్యాకు చెందిన రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు సరిహద్దులు దాటి తమ గగనతలంలోకి వచ్చాయని ఫిన్ ల్యాండ్ ఆరోపిస్తుండగా.. రష్యా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఫిన్‌ల్యాండ్ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హెల్‌సింకి తీరంలో అర కిలోమీటర్ దూరం ఫిన్‌లాండ్ గగనతలంలోకి చొచ్చుకువచ్చిన సుఖోయ్ యుద్ధ విమానాలు... దాదాపు 2 నిమిషాల పాటు చక్కర్లు కొట్టి వెళ్లాయని ఫిన్‌ల్యాండ్ రక్షణ శాఖకు చెందిన మీడియా అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ నినా హిర్‌స్కీ తెలిపారు. సుఖోయ్ యుద్ధ విమానాల రాకగు గుర్తించే తాము F/A-18C హార్నెట్ యుద్ధ విమానాన్ని ( Finland's F/A-18C Hornets) రంగంలోకి దింపామని ఆమె పేర్కొన్నారు. Also read: Rafale fighter jets: పాకిస్తాన్, చైనాలకు భారత్ వార్నింగ్ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిన్‌ల్యాండ్ చేస్తున్న ఈ ఆరోపణలపై రష్యా స్పందిస్తూ.. నాలుగు సుఖోయ్ యుద్ధ విమానాలు షెడ్యూల్ ప్రకారం రష్యాలోని నార్త్ వెస్ట్ కరెలియా నుంచి కలినింగ్రాండ్‌కి వెళ్లింది వాస్తవమే కానీ.. ఆ విమానాలు ఏ ఇతర దేశాల గగనతలంలోకి ప్రవేశించలేదని తెలిపింది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ వివరణ ఇచ్చినట్టుగా రష్యన్ న్యూస్ ఏజెన్సీ TASS వెల్లడించింది. పైలట్స్ నిరంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందితో టచ్‌లోనే ఉన్నారని రష్యా రక్షణ శాఖ చెప్పినట్టుగా టాస్ పేర్కొంది. Also read: #Watch Rafale fighter jetsకి అంబాలాలో ఘన స్వాగతం


పొలాండ్-లిత్వేనియా మధ్య ఉన్న కలినింగ్రాడ్‌కి రష్యా తరచుగా తమ యుద్ధ విమానాలను పంపిస్తుంటుంది. బాల్టిక్ సీ, గల్ఫ్ ఆఫ్ ఫిన్ ల్యాండ్ మీదుగా ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ ద్వారానే రష్యా విమానాలు కలినింగ్రాడ్‌కి వెళ్తుంటాయి. Also read: Rafale Facts: రాఫెల్ విమానాల గురించి మీకు తెలియని 10 విషయాలు