అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం...42 మంది మృతి..కలచివేస్తున్న దృశ్యాలు!
Fire accident in algeria: ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో దారుణంం జరిగింది. కబైలియా రీజియన్ లోని కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగి.. 42 మంది మృత్యువాత పడ్డారు.
Fire accident in Algeria: ఉత్తర ఆఫ్రికా(Africa) దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. కబైలియా రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పలు దఫాలుగా మంటలు చెలరేగి..42 మంది మరణించారు. వీరిలో 25 మంది సైనికులతో పాటు 17 మంది సాధారణ పౌరులు ఉన్నారు. సుమారు వంద మందికి పైగా ప్రజలను సైనికులు కాపాడారు. మంటలను అదుపు చేసే క్రమంలో సైనికులు సైతం మృతి చెందారు.
అల్జీరియా(Algeria)లోని దాదాపు 17 రాష్ట్రాల్లో కార్చిచ్చు చెలరేగుతోంది. 100కు పైగా ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. చనిపోయిన సైనికులు, పౌరులకు ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ మాజిద్ టెబ్బౌనే(Abdelmadjid Tebboune) నివాళులర్పించారు. అనేక గ్రామాలు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయాయి. అడవుల్లో పశువులు, పక్షులు మంటలకు ఆహుతైన దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. అనేక మంది ఇప్పటికే గ్రామాలను విడిచి వెళ్లిపోయారు. కొంత మంది మంటలు తమ ఇళ్లను తాకకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: బీ అలర్ట్: భయపెడుతున్న మరో కొత్త వైరస్..! డెత్ రేట్ 88 శాతం..!
కొంతమంది దుండగులు కావాలని నిప్పు పెట్టడం వల్లే ఈ మంటలు చెలరేగుతున్నాయని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కమెల్ బెల్డ్‌జౌద్ ఆరోపించారు. ప్రధాని సైతం ఈ తరహా అనుమానాలే వ్యక్తం చేశారు. మంటలు(fires) చెలరేగుతున్న తీరు చూస్తుంటే కచ్చితంగా కొంతమంది నేరస్థులే ఈ దుశ్యర్యకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఒకే ప్రాంతంలో ఒకే సమయానికి 30 ప్రదేశాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం అనేక అనుమానాలను కలిగిస్తోందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook