అమెరికా: ప్లోరిడా ప్రాంతానికి చెందిన  ఐదేళ్ల చిన్నారి బెషరాకి ఆకలేసింది.. ఇంట్లో చూస్తే అమ్మా నాన్న బయటకు వెళ్లారు.. పిజ్జా ఆర్టర్ చేయాలనుకొని డిసైడ్ అయ్యాడు. మొబైల్ ఫోన్ తీసి తనకు తోచిన ఏదో ఒక నెంబర్ కు ఫోన్ కొట్టారు. తెలియకుండానే  911కు కాల్ చేశాడు... దీంతో అదికాస్త పోలీసులకు వెళ్లింది. పిల్లాడి మాటలు విని ఏదో అపాయంలో ఉన్నాడని భావించిన పోలీసులు హటాహటిన అక్కడికి చేరుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాల్ చేసింది ఐదేళ్ల పిల్లాడు అని తెలుసుకుని అవాక్కయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉంటే పోలీసులు తమ ఇంటి ముందు ప్రత్యక్షం కావడంతో బెషరా సోదరి ఒకింత షాక్ కు గురైంది. ఫోన్ ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నించగా తనకు తెలియకుండానే తమ్ముడు  కాల్ చేశాడనీ... తమను క్షమించాలని కోరింది. దీంతో పోలీసులు.. 911 నంబర్ కు ఎప్పుడు డయల్ చేయాలి. ఎప్పుడు చేయకూడదు అనే విషయాన్ని బెషరాకు వివరించారు. అనంతరం ఓ కింగ్ సైజ్ పిజ్జాను మాన్యుయెల్ బెషరాకు అందించారు. దీంతో బుడతడి సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. ఎంచక్కా  గంతులేస్తూ పిజ్జా తీసుకొన్నాడు ఆ బుడతడు.