Nigeria Floods: దశాబ్ద కాలంలో చూడని మహా వరద.. ఏకంగా 603 మంది మృతి.. నిరాశ్రయులుగా 13 లక్షల మంది!
Floods In Nigeria : ఆఫ్రికా దేశమైన నైజీరియాలో వరదల కారణంగా 600 మందికి పైగా మరణించగా 13 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలలో తలదాచుకోవాల్సి వచ్చింది.
Floods In Nigeria : ఆఫ్రికా దేశమైన నైజీరియాలో తాజాగా వరదలు బీభత్సం సృష్టించాయి. ఒక దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరదల కారణంగా 600 మందికి పైగా మరణించారు. ఇక ఈ వరదల కారణంగా 13 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఆ దేశ మంత్రి సాదియా ఉమర్ ఫరూక్ చెబుతున్న దాని ప్రకారం ఈ వరదల కారణంగా 16 అక్టోబర్ 2022 నాటికి 600 మందికి పైగా మరణించారు.
గత ఒక్క వారంలోనే 500 మంది మరణించారని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు వరదలకు సిద్ధంగా లేరని, దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. ఊహించని పరిస్థితులులో వచ్చిన ఈ వరదలు పెను విధ్వంసం సృష్టించాయని సాదియా ఉమర్ ఫరూఖ్ పేర్కొన్నారు. ఇక ఈ వరదల వలన 82 వేలకు పైగా ఇళ్లు, దాదాపు 110,000 హెక్టార్ల (272,000 ఎకరాలు) వ్యవసాయ భూమి పూర్తిగా నాశనమైందని ఆయన అన్నారు.
నైజీరియాలో వర్షాకాలం సాధారణంగా జూన్‌లో ప్రారంభమవుతుంది కానీ ఈసారి ఆలస్యంగా ఆగస్టు నుంచి ఈ వర్షాలు మొదలయ్యాయి. ఇక పదేళ్ల క్రితం అంటే 2012లో ఆ దేశంలో తీవ్రమైన వరదల కారణంగా 363 మంది మరణించగా, 21 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఆఫ్రికాలోని ఈ దేశం వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దాని ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అనేక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోండగా ఇప్పుడు మూలిగేనక్కపై తాటికాయలా ఈ వరదలు వచ్చిపడ్డాయి. ఈ వరదల కారణంగా దేశంలోని సుమారు 200 మిలియన్ల మంది ప్రజలు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని దేశంలోని పలువురు అనలిస్టులు అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే స్థానిక ఉత్పత్తి ప్రోత్సహించేందుకు నైజీరియా ఈ మధ్యనే బియ్యం దిగుమతిని నిషేధించింది, ఇంతలో ఈ వరదల కారణంగా పండిస్తున్న పంటలు అన్నీ ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. నైజీరియాలోని 36 రాష్ట్రాల్లో 27 రాష్ట్రాలను తాజా వరదలు ప్రభావితం చేశాయి. డెల్టా, రివర్స్, క్రాస్ రివర్, బేల్సా సహా అనంబ్రా వంటి రాష్ట్రాలతో సహా దేశంలోని దక్షిణ ప్రాంతంలోని కొన్ని ప్రావిన్సులలో నవంబర్ చివరి వరకు వరదలు కొనసాగవచ్చని నైజీరియా వాతావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: Pakistan Bus Fire: పాకిస్తాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 21 మంది సజీవదహనం! వరదలు వదిలేసినా..
Also Read: China Covid-19: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... లాక్‌డౌన్ విధించిన సర్కార్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook