Former South Korean president Roh Tae-woo dies: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్​ తై​-వూ (88) (Roh Tae Woo) కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు సియోల్​ నేషనల్ యూనివర్సిటీ ఆసుపత్రి వెల్లడించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న(Roh Tae Woo) తై వూ ఇటీవల ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sudan coup: నిరసనలతో అట్టుడుకుతున్న సుడాన్...షాక్ ఇచ్చిన అమెరికా..!


సైనిక తిరుగుబాటులో కీలక పాత్ర..
కొరియా యుద్దం, వియత్నాం వార్ లో కీలక భూమిక పోషించారు. 1979లో జరిగిన సైనిక తిరుగుబాటుకు తై​-వూ (Roh Tae Woo) నాయకత్వం వహించారు. అంతేకాకుండా తన స్నేహితుడు చున్​ దూ-వాన్(Chun Doo-hwan)​ను​ అధ్యక్షుడిని చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే సైనిక పాలన(Military rule)పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం వల్ల 1987లో ఎన్నికలు నిర్వహించి అధ్యక్ష పదవికి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన తై​-వూ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. 1988 నుండి 1993 వరకుఅధ్యక్షుడిగా కొనసాగారు. 


1988లో సియోల్ ఒలింపిక్స్ నిర్వహించడంలో తై​-వూ(Roh Tae-woo) కీలకపాత్ర పోషించారు. రాజద్రోహం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన జైలు శిక్ష కుడా అనుభవించారు. అనంతరం క్షమాభిక్ష పొంది జైలు నుంచి విడుదలైన వూ.. మిగిలిన జీవితాన్ని సమాజానికి దూరంగా ఉంటూ గడిపారు.


Also Read: China Puts City On Lockdown: కరోనా ధాటికి చైనాలో మరోసారి లాక్​డౌన్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి