Former US President Barack Obama : గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియా సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కొన్నారు. అయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా సిరీస్ కైవసం చేసుకున్నారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకనుకుంటున్నారా.. తాను సైతం జాత్యహంకార వ్యాఖ్యలు, జాతి విద్వేషాన్ని ఎదుర్కొన్నానని అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్కూల్ రోజుల్లో జరిగిన అవమానకర పరిస్థితిని అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) సోమవారం స్థానిక మీడియాకు వివరించారు. ‘అప్పుడు నేను బాస్కెట్‌బాల్ ఆడుతున్నాను. ఈ క్రమంలో ఓ రూమ్ లాకర్ విషయంలో నా క్లాస్‌మేట్ గొడవకు దిగాడు. నాపై కొన్ని జాతి విద్వేష వ్యాఖ్యలు చేశాడు. ఇది మంచి పద్దతి కాదని వారించినా అతడు వినలేదు. దీంతో నాకు చాలా కోపం వచ్చింది.


Also Read: BSNL ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు Double Data, అన్‌లిమిటెడ్ కాల్స్ సహా మరెన్నో ప్రయోజనాలు


అతడి ముఖంపై గట్టిగా ఒక పంచ్ ఇచ్చాను. అంతే అతడి ముక్కుపగిలి రక్తస్రావమైంది. ఇంకెప్పుడు నన్ను ఆ మాటలతో పిలవకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఆ సమయంలో మేం లాకర్ రూమ్‌లో ఉన్నామని’ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అమెరికా(America) మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా షేర్ చేసుకున్నారు.


Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో పుంజుకున్న బంగారం ధరలు, ఆల్‌టైమ్ గరిష్టానికి Silver Price 


అమెరికాకు తొలి నల్లజాతి సంబంధిత అధ్యక్షుడిగా బరాక్ ఒబామా నిలిచారు. అయినా తన పరిపాలనతో అమెరికా ప్రజల గౌరవ మర్యాదలు పొందారు. నేటికీ అమెరికా పౌరులతో పాటు విదేశీయులు, ఎన్నారైలు ఒబామా పాలనపై ప్రశంసలు కురిపిస్తారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న అనంతరం సాధారణ పౌరుడిలా ఒబామా తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నానని పలుమార్లు పేర్కొనడం తెలిసిందే.


Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు Supreme Court శుభవార్త


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook