COVID19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై రష్యా శుభవార్త
ప్రపంచ దేశాలకు తాము కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine)ను అందిస్తామని రష్యా ప్రధాన మంత్రి మిఖైల్ మిషుస్తిన్ పేర్కొన్నారు. తమ దేశంలో అత్యుత్తమ కోవిడ్19 టీకాలు ఉత్పత్తి అవుతున్నాయని రష్యా పార్లమెంట్్ దిగువ సభలో తెలిపారు.
ప్రపంచ దేశాలన్నీ కోవిడ్19(Covid19 Vaccine) వ్యాక్సిన్ కోసం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న తరుణంలో రష్యా ఓ శుభవార్త చెప్పింది. తమ దేశంలో కరోనా టీకా(Corona Vaccine) తయారీలో ముందంజలో ఉందని రష్యా ప్రధాని మిఖైల్ మిషుస్తిన్ బుధవారం పేర్కొన్నారు. రష్యా పార్లమెంట్ దిగువ సభలో కరోనా అంశంపై ఆయన మాట్లాడారు. వారి దేశంలో 17 ప్రముఖ సంస్థలు కరోనా వ్యాక్సిన్ పనుల్లో బిజీగా ఉన్నాయని, మొత్ంగా 26 రకాల కోవిడ్19 టీకాలు (Covid19 Vaccine Russia) రూపొందిస్తున్నాయని తెలిపారు. Actress Rekha Suicide: యాంకర్, టీవీ నటి రేఖ ఆత్మహత్య
నాలుగు రకాల వ్యాక్సిన్‌ల ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, వీటి వల్ల ఏ హాని లేదని అధికారిక సంస్థలు తేలినట్లు పేర్కొన్నారు. ఇందులో రెండు టీకాలు (Russia Covid19 Vaccine) చివరి దశ ప్రయోగాలలో ఉన్నాయని రష్యా ప్రధాని మిఖైల్ మిషుస్తిన్ వివరించారు. మరో రెండు టీకాలు త్వరలోనే చివరి దశ ప్రయోగాలు చేపట్టనున్నారని చెప్పారు. COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే
రష్యాలోని సంస్థలు తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే రష్యా త్వరలోనే ప్రపంచ దేశాలకు కోవిడ్19 వ్యాక్సిన్ అందించనుందని.. తమ కరోనా టీకాలకు ఇతర దేశాల నుంచి భారీ డిమాండ్ ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు. జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్