ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్‌కి తన పెంపుడు కుక్క వల్ల తన తోటి మంత్రుల వద్దే పరాభవం ఎదురైంది. తన ఎలిసీ ప్యాలెస్‌‌లో మంత్రులు, ప్రభుత్వాధికారులతో అత్యవసరంగా సమావేశమైన ఫ్రాన్స్ అధ్యక్షుడు వారితో మాట్లాడుతున్నప్పుడు అతని పెంపుడు కుక్క నీమో కూడా అతని వెంటే అక్కడకు వచ్చేసింది. అటూ ఇటూ తచ్చాడుతూ.. గట్టిగా అరుస్తూ.. అందరూ చూస్తుండగానే ప్యాలెస్‌లో మూత్రం పోసేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ సంఘటన చూసిన అధ్యక్షుడు తన కుక్కను తప్పుగా అర్థం చేసుకోవద్దని తన మంత్రులకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక చేసేదేమీ లేక, అందరూ ఆ కుక్క దగ్గరకు వెళ్లకుండా సమావేశంలో మమేకమయ్యారు. నీమో అనే కుక్కను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇటీవలే ఒక రెస్క్యూ సెంటరు నుండి దత్తత తీసుకున్నారు. దానిని ఎప్పుడూ తన వెంటే తీసుకెళ్ళడం మాక్రోన్ అలవాటు.


మీడియా సమావేశాలకు కూడా ఈ శునకంతోనే హాజరవుతుంటారు మాక్రోన్. ఫ్రాన్స్‌లో చాలామంది ప్రముఖులకు కుక్కలను పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టం. గతంలో కూడా నికోలస్ సార్కోజీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతని కుక్క ప్యాలెస్‌లోని ఫర్నిచర్‌ని ధ్వంసం చేసింది.