Global Day of Parents 2022: ఇవాళ ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం. జీవితంలో తల్లిదండ్రుల ప్రాధాన్యతను చాటి చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. పిల్లల కోసం తల్లిదండ్రులు పడే కష్టం, చేసే త్యాగాలు, వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు చేసే కృషిని గుర్తిస్తూ.. అందుకు గౌరవార్థంగా ఈరోజును జరుపుకుంటారు. ఐరాస జనరల్ అసెంబ్లీ 2012లో తొలిసారి ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం నిర్వహించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చరిత్రలో ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం.. :


ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం అన్ని దేశాల్లో ఒకే రోజున జరుపుకోరు. అమెరికా సహా కొన్ని దేశాల్లో ప్రతీ ఏటా జూలై నాలుగో ఆదివారాన్ని ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవంగా జరుపుకుంటారు. అమెరికాలో ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం నాడు తల్లిదండ్రులందరికీ సెలవు ఉంటుంది. ఈ మేరకు 1994లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ యూఎస్ కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని చట్టంగా ఆమోదించారు.


దక్షిణ కొరియాలో ప్రతీ ఏటా మే 8వ తేదీన ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి మాత్రం జూన్ 1న ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవంగా ప్రకటించింది. దీంతో పలు దేశాల్లో జూన్ 1న ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.


ఈసారి థీమ్ ఇదే... :


ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరినీ అభినందించడమే ఈసారి ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం థీమ్. ఉరుకుల పరుకుల జీవితంలో తల్లిదండ్రులతో ప్రత్యేకంగా ఒకరోజు గడిపేందుకు... వారి పట్ల కృతజ్ఞతను చాటేందుకు ఇది ప్రత్యేకమైన రోజు. ఏమిచ్చినా తల్లిదండ్రుల రుణం తీరనిది కాబట్టి... మీరు చూపించే ప్రేమ, అభిమానం మాత్రమే వారికి మీరిచ్చే గొప్ప కానుక.


 


Also Read: LPG Cylinder Price: బిగ్ రిలీఫ్... భారీగా తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర... ఏయే నగరాల్లో ఎంతంటే.. 


Also Read: World Milk Day 2022: నేడు ప్రపంచ పాల దినోత్సవం.. అసలు ఇది ఎందుకు జరుపుకుంటారు.. దీని ప్రాముఖ్యత ఏంటి...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook