Canada Jobs: ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశమైన కెనడా శాశ్వతంగా ఆ దేశంలో ఉండేందుకు స్వాగతిస్తోంది. పది లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ, చేయనుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా..అయితే ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే. ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశమైన కెనడాల పది లక్షల ఉద్యోగాలు వేచి చూస్తున్నాయి. ఎన్‌డిటీవీ ప్రోఫిట్ నివేదిక ప్రకారం 2021 మే నాటికి 3 లక్షలకు పైగా ఉద్యోగాలు పెరిగాయి. లేబర్ ఫోర్స్ సర్వే  2022 మే నివేదిక ప్రకారం వివిధ పరిశ్రమల్లో సిబ్బంది కొరత ఉందని..కెనడా దేశానికి ఇమ్మిగ్రేషన్ డిమాండ్ పెరిగిందని తెలుస్తోంది. దీనికి కారణం దేశంలో రిటైర్మెంట్ వయస్సుకు సమీపిస్తున్నవాళ్లు అధికం కావడమే. అందుకే కెనడాలో పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి.


కెనడా దేశం ప్రస్తుతం పెద్ద సంఖ్యలో శాశ్వత నివాసితుల్ని ఆహ్వానిస్తోంది. కెనడా దేశం 4.3 లక్షలమందిని లక్ష్యంగా చేసుకోగా..2024 నాటికి 4.5 లక్షలు కానుంది. వలసవెళ్లేవారికి చాలా మంచి అవకాశమని తెలుస్తోంది. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య చాలా తక్కువగా ఉంటుంది. ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయి. కెనడా దేశపు శాశ్వత నివాసిగా అప్లై చేసుకుంటే..మీకు ఆ దేశంలో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ఉంటుంది. 


ఆల్బెర్టా, ఒంటారియోలో ఏప్రిల్ నెలలో ప్రతి ఒక ఉద్యోగానికి ఒకరు మాత్రమే నిరుద్యోగి ఉన్నారు. మార్చ్ నెలలో ఇది 1.2 కాగా, గత ఏడాది 2.4 ఉంది. ఇక న్యూ ఫౌండ్ ల్యాండ్ , లాబ్రేడర్ ప్రాంతాల్లో ప్రతి ఒక ఖాళీకు నలుగురు నిరుద్యోగులున్నారు. ప్రొఫెషనల్స్, సైంటిఫిక్, టెక్నికల్ సర్వీసెస్, ట్రాన్స్‌పోర్టేషన్, వేర్ హౌసింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, లీజర్, రిక్రియేషన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో భారీగా ఖాళీలున్నాయి. ఇక నిర్మాణ రంగంలో భారీగా ఖాళీలున్నాయి. 


మే నెలలో లాడ్జింగ్, ఫుడ్ సర్వీసెస్ రంగాల్లో 1.61 లక్షల ఖాళీలున్నాయి. ఎక్కువమంది 55 ఏళ్ల వయస్సువారి రిటైర్మెంట్ కారణంగా కెనడాలో సిబ్బంది మార్కెట్ భారీగా పడిపోయింది. కెనడా దేశవ్యాప్తంగా 90 లక్షలమంది రిటైర్ కానున్నారని తెలుస్తోంది. ఇక ఆర్బీసీ నివేదిక ప్రకారమైతే..మూడింట ఒక వంతు పదవీ విరమణకు సమీపంలో ఉండగా..ప్రతి పదిమందిలో ముగ్గురు రిటైర్ అవుతున్నారు. ఇక కెనడాలో ఫెర్టిలిటీ రేటు కనిష్టంగా 1.4కు చేరుకుంది. 


Also read: International Cat Day 2022: ఆగస్ట్ 8న ఇలాంటి ఒక రోజు ఉందని తెలుసా..? అసలు క్యాట్ డే ప్రత్యేకత ఏంటో తెలుసా..?



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook