నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్ మహిళల కోసం ప్రత్యేక డూడుల్ రూపొందించింది. అయితే ఈసారి గూగుల్ డూడుల్‌ను వీడియో రూపంలో తీసుకొచ్చింది. కొన్ని ప్రత్యేక సందర్బాలలో వీడియో రూపంలో డూడుల్ అందించే గూగుల్.. మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా మహిళల ప్రత్యేకతలు చాటిచెప్పే ప్రయత్నం చేసింది. కొన్ని లేయర్లుగా త్రీడీ పేపర్ మండల యానిమేషన్ వీడియోను ఉమెన్స్ డే 2020కి అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1900 నుంచి నేటి వరకు లింగ సమానత్వం కోసం, కార్మికుల పోరాటాలు చేసిన విషయాన్ని కొన్ని లేయర్ల రూపంలో చిత్రీకరించారు. వీడియో మొదటి భాగంలోని నలుపు-తెలుపు లేయర్ 1800ల నుంచి 20వ శతాబ్దం వరకు పనిలో సమాన వేతనం, సమాన హక్కులు కోరిన విషయాన్ని చాటి చెబుతోంది. పలు రంగాల్లో మహిళలు తమదైన చెరగని ముద్రవేస్తూ సంచలనాలు చేస్తున్నారని, ఆకాశమే వారికి హద్దు అని తెలుపుతుంది.



ఓస్లో, లండన్‌కు చెందిన ఆర్టిస్టులు జూలీ విల్కిన్ సన్, మెకెరీ స్టూడియోకి చెందిన జోయాన్నే హార్స్ క్రాఫ్, జ్యూరిచ్‌కు చెందిన గెస్ట్ యానిమేటర్లు మారియన్ విలియం, డాప్నే అబ్డర్ హల్డెన్‌లు కలిసి తరతరాలుగా మహిళల విశిష్టత, ప్రాముఖ్యతను వివరించేలా నిమిషం లోపే నిడివి ఉన్న గూగుల్ డూడుల్‌ వీడియోను రూపొందించి అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలిపారు.


Also Read: ఆడపిల్లకు జన్మనిచ్చిన చెన్నకేశవులు భార్య


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..