Google plan to extend Work From Home due to Omicron Effect: కరోనా వైరస్‌ కొత్త వేరియెంట్ 'ఒమిక్రాన్‌' (Omicron) ప్రపంచ దేశాలకు మరోసారి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాలకు పాకిన ఒమిక్రాన్‌.. ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతోంది. ఒమిక్రాన్‌ కారణంగా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు, నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థ గూగుల్‌ (Google).. తమ ఉద్యోగులకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 2022 జనవరి 10 నుంచి ఉద్యోగులు ఆఫీసులకు తప్పనిసరిగా రావాలన్న ఆదేశాల్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దాంతో ఆ సంస్థ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి 2022 జనవరి 10 నుంచి వర్క్‌ఫ్రమ్‌ హోం (Work From Home) పాలసీకి ముగింపు పలకాలని గూగుల్‌ (Google) నిర్ణయించింది. వారంలో కనీసం మూడు రోజుల పాటు ఉద్యోగులు ఆఫీసులకు రప్పించేందుకు గూగుల్‌ ప్రణాళిక చేసింది. ఇదే విషయం ఉద్యోగులకు కూడా చెప్పింది. డెల్టా వేరియెంట్‌ భయాందోళనలు సైతం పట్టించుకోకుండా గూగుల్‌ ముందుకెళ్లాలని చూసింది. ఇంతలోనే దక్షిణాఫ్రికాలో 'ఒమిక్రాన్‌' వేరియెంట్‌ బయటకొచ్చింది. ఇది మిగతా వేరియెంట్ల కంటే ప్రమాదకరమైనదని అందరూ అంటున్నారు. ప్రాణానికి కూడా ముప్పు ఉందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్‌ హోం పాలసీపై గూగుల్‌ వెనక్కి తగ్గింది. 


Also Read: IND vs NZ 2nd Test: అంపైర్ తప్పిదానికి బలి.. ఔట్ అయిన కోపంలో విరాట్ కోహ్లీ ఏంచేశాడంటే (వీడియో)!!


2022 జనవరి 10 నాటికి నెలకొనే పరిస్థితులను సమీక్షించాకే నిర్ణయం తీసుకుంటామని గూగుల్‌ (Google) ఎగ్జిక్యూటివ్స్‌, ఉద్యోగులతో చెప్పినట్టు సమాచారం తెలుస్తోంది. వ్యాక్సినేషన్‌ తప్పనిసరి పాలసీపై నిరసన వ్యక్తం చేయడం, వర్క్‌ఫ్రమ్‌ హోం (WFH) పాలసీలో మరికొన్నాళ్లు కొనసాగుతామని ఉద్యోగులు డిమాండ్‌ చేయడం కూడా గూగుల్‌ వెనక్కి తగ్గడానికి మరో కారణం అట. గూగుల్‌కు మొత్తం 60 దేశాల్లో దాదాపు 85 ఆఫీసులు ఉన్నాయి. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగులను ఆఫీసుకి రప్పించాలని చూసినా.. అది కుదిరేటట్టు లేదు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook