Putin Wax Statue: ఉక్రెయిన్​పై రష్యా దాడులక వారం రోజులు దాటింది. రష్యా దాడులను ఆది నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న యురోపియన్ దేశాలు.. ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి. రష్యా ఖాతాలను నిలిపివేయడం వంటి చర్యలకు దిగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రాన్స్ రాజధాని పారిస్​లో ఉన్న 'గ్రెవిన్ మ్యూజియం'లో పుతిన్ మైనపు విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రెవిన్ మ్యూజియం డైరెక్టర్​ పుతిన్ మైనపు విగ్రహాన్ని తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.


ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్​పై రష్యా దాడులు ప్రారంభించగా.. వివిధ దేశాలు రష్యాను వ్యతిరేకించాయి. అంక్షలు విదిస్తున్నా రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీనితో పుతిన్​ నియంతృద్వ పోకడలకు పోతున్నట్లు విమర్శలు చేస్తున్నాయి యురోపియన్ దేశాలు.


ఈ నేపథ్యంలో పుతిన్ మైనపు విగ్రహాన్ని తొలగిస్తున్నట్లు తెలిపిన గ్రెవెన్​ మ్యూజియం. 'హిట్లర్ వంటి నియంతలకు ఎప్పుడు చోటు ఇవ్వలేదు. ఇప్పుడు పుతిన్​కు కూడా మా మ్యూజియంలో చోటు ఇవ్వాలనుకోవడం లేదు' అని చెప్పుకొచ్చింది. తదుపరి నోటుసులు వచ్చే వరకు పుతిన్ విగ్రహాన్ని వైర్​హౌజ్​లో పెట్టాలని నిర్ణయించినట్లు మ్యూజియం డైరెక్టర్ వెల్లడించారు. పుతిన్ విగ్రాన్ని 2000 సంవత్సరంలో రూపొందించినట్లు వివరించారు. ఇక పుతిన్​ విగ్రాన్ని తొలగించడంతో.. ఏర్పడిన ఖాళీ స్థలంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలన్​స్కీ విగ్రహం పెట్టే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు.



గత వారం రోజులుగా మ్యూజియాన్ని సందర్శించిన వారిలో కొంత మంది పుతిన్ విగ్రహంపై దాడి చేశారని తెలిపారు మ్యూజియం డైరెక్టర్​. అయితే దాడి తర్వాత పుతిన్​ జుట్టును, విగ్రహాన్ని సరిచేయాలని తమ స్టాఫ్​ భావించలేదని చెప్పారు. పుతిన్​పై పెరిగిన వ్యతిరేకతే ఇందుకు కారణమని వివరించారు.


Also read: Ukraine Crisis: రష్యన్ మిలటరీ ట్యాంకును ఎత్తుకెళ్లిన ఉక్రెయిన్‌ రైతు, వీడియో వైరల్


Also read: Indians In Ukraine: షాకింగ్ న్యూస్! ఉక్రెయిన్ నుంచి వెళ్లాలనుకునే ఇండియన్స్‌ని కొడుతున్నారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook