దావోస్: భారతదేశంలో ఆర్థిక వృద్ధి మందగమనం తాత్కాలికంగా కనబడుతోందని, ముందు ముందు అది ఊపందుకుంటుందని ఆశిస్తున్నట్లు ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) 2020లో మాట్లాడుతూ, ఐఎంఎఫ్ తన ప్రపంచ ఆర్థిక outlook అక్టోబర్ 2019లో ప్రకటించినప్పుటి పరిస్థితులతో పోలిస్తే 2020 జనవరిలో మెరుగైన పరిస్థితి కనిపిస్తోందని ఆమె అన్నారు.


యుఎస్-చైనా మొదటి దశ వాణిజ్య ఒప్పందం, సరళీకరించిన పన్ను తగ్గింపుల తరువాత వాణిజ్య ఉద్రిక్తత తగ్గడం సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుందని ఆమె అన్నారు. అయితే, ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సానుకూలం కాదని అన్నారు. ఇప్పటి వరకు మందగించిన ఆర్ధిక వృద్ధి, విధానాలు మరింత దూకుడుగా ఉండాలని, నిర్మాణాత్మక సంస్కరణలు రావాలని  అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.


భారతదేశం లాంటి పెద్ద మార్కెట్లో డౌన్ గ్రేడ్ కలిగి ఉన్నామని, కానీ అది తాత్కాలికమని, ఇండోనేషియా, వియత్నాం వంటి కొన్ని దేశాల్లో పరిస్థితి మెరుగ్గా ఉందని ఆమె పేర్కొన్నారు. అనేక ఆఫ్రికన్ దేశాల్లో వృద్ధి మెరుగ్గా ఉందని, అయితే మెక్సికో వంటి మరికొన్ని దేశాల్లో ప్రతికూల వాతావరణం కనబడుతోందని ఆమె అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..