America Gun Fire: 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు కాల్చివేత.. అమెరికాలో మరోసారి కాల్పుల మోత
America Gun Fire: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. సౌత్ టెక్సాస్ లోని ఓ స్కూల్ లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 18 మంది పిల్లలు సహా మొత్తం 21 మందిని చంపేశాడు. మృతుల్లో టీచర్ కూడా ఉన్నారు. 18 ఏళ్ల యువకుడు.. ప్రైమరీ స్కూల్ లో చొరబడి తన వెంట తెచ్చుకున్న గన్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు
America Gun Fire: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. సౌత్ టెక్సాస్ లోని ఓ స్కూల్ లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 18 మంది పిల్లలు సహా మొత్తం 21 మందిని చంపేశాడు. మృతుల్లో టీచర్ కూడా ఉన్నారు. 18 ఏళ్ల యువకుడు.. ప్రైమరీ స్కూల్ లో చొరబడి తన వెంట తెచ్చుకున్న గన్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల ఘటనతో స్పాట్ కు వచ్చిన పోలీసులు దుండగుడిని హతమర్చారు. ఈ ఘటనలో చనిపోయిన విద్యార్థులంతా 4 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉన్నవారే.
టెక్సాస్‌లోని ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్ లో జరిగిన ఈ ఘటనలో టీచర్ సహా 14 మంది చనిపోయారని మొదట టెక్సాక్ గవర్నర్ గ్రెర్ అబోట్ ప్రకటించారు. తర్వాత టెక్సాస్ రాష్ట్ర సెనేటర్ రోలాండ్ గుటిరెజ్ టెక్సాస్ రేంజర్స్ స్టేట్ పోలీసుల సమాచారం ప్రకారం 18 మంది పిల్లలు, ముగ్గురు సిబ్బంది కాల్పుల ఘటనలో చనిపోయారని తెలిపారు. నిందితుడిని 18 ఏళ్ల సాల్వడార్ రామోస్‌గా గుర్తించారు. హంతకుడిని హతమార్చే క్రమంలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని గవర్నర్ చెప్పారు. పోలీసులు సేఫ్ గానే ఉన్నారన్నారు.
హంతకుడు ఒంటరిగానే స్కూల్ లోకి చొరబడ్డారని.. అతడు స్కూల్ కు వచ్చే ముందు.. తన తల్లిని హతమార్చాడని పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిగిన స్కూల్ లో మొత్తం ఐదు వందల మంది కంటే ఎక్కువగానే స్టూడెంట్స్ ఉన్నారు. గన్ ఫైర్ తర్వాత పోలీసులు.. స్కూల్ ను తమ అధీనంలోకి తీసుకున్నారు. కాల్పుల సమాచారాన్ని ప్రెసిడెంట్ జో బైడెన్ కు స్థానిక అధికారులు అందించారు. గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన ఘటన అని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబాట్ చెప్పారు.టెక్సాస్ కాల్పుల ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. మే 28 వరకు సంతాప దినాలు ప్రకటించారు.
2018లో ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో 14 మంది స్టూడెంట్స్ తో పాటు ముగ్గురు టీచర్లను దుండగులు కాల్చి చంపాడు. ఆ కాల్పుల ఘటన తర్వాత ఇదే అత్యంత ఘోరమైన ఘటన. అమెరికాలో కాల్పుల ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. 2020 సంవత్సరంలో 19 వేల 350 మంది కాల్పులకు బలయ్యారు. 2019 కంటే దాదాపు 35 శాతం కాల్పుల ఘటనల్లో మరణాలు పెరిగాయని అమెరికా సీడీసీ ప్రకటించింది.
READ ALSO: Konaseema Protest: కర్ఫ్యూతో తగ్గిన ఉద్రిక్తత.. నివురుగప్పిన నిప్పులా కోనసీమ
READ ALSO: Edible Oil: కేంద్రం కీలక నిర్ణయం.. వంట నూనెల ధరలు దిగొచ్చే అవకాశం...!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి