Ebrahim Raisi: ఇరాన్‌లో కలకలం ఏర్పడింది. ఆ దేశ  అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ  ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఆచూకీ లభించలేదు. వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో హెలికాప్టర్‌ అదృశ్యమైంది. ఇప్పటివరకు వస్తున్న సమాచారం అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంఇ. అది కూలిపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇరాన్‌లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉంది? ఆయన ప్రాణాలతోనే ఉన్నారా? అని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Starliner: కీలక అంతరిక్ష ప్రయోగం నిలిపివేత.. సునీతా విలియమ్స్‌ రికార్డుకు బ్రేక్‌


 


ఇరాన్‌లో తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో అధ్యక్షుడు ఇబ్రహీం ప్రయాణిస్తున్నాడు. ఈ సమయంలో హెలికాప్టర్‌ అనూహ్యంగా కనిపించలేదు. ఆ సమయంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌తోపాటు కాన్వాయ్‌లో మరో రెండు హెలికాప్టర్లు ఉన్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అధ్యక్షుడితోపాటు విదేశాంగ మంత్రి హోసేన్‌ అమిరాబ్దోల్లాహియన్‌, తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌, ఇతర అధికారులు ప్రయాణిస్తున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. ప్రమాద ప్రాంతం దేశ రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Also Read: Air India Flight: ట్రక్‌ను ఢీకొన్న ఎయిరిండియా విమానం.. ప్రాణభయంతో ఉలిక్కిపడిన ప్రయాణికులు


 


ఈ ప్రమాదంపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. అయితే భారీ వర్షం, గాలులతో అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితులతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. అయితే ఆదివారం అజర్‌బైజాన్‌లో ఆరాస్‌ నదిపై నిర్మించిన డ్యామ్‌ను ప్రారంభించేందుకు అధ్యక్షుడు వెళ్లాడు. ఈ బ్రిడ్జిని అజర్‌బైజాన్‌, ఇరాన్‌ సంయుక్తంగా నిర్మించారు. ఆరాస్‌ నదిపై రెండు దేశాలు కలిపి మూడు డ్యామ్‌లను నిర్మించడం విశేషం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter