Hillary Storm: బీభత్సం రేపుతున్న హిల్లరీ తుపాను, కాలిఫోర్నియా, లాస్ ఎంజిల్స్ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు
Hillary Storm: అగ్రరాజ్యం అమెరికాను తపాను బీభత్సం సృష్టిస్తోంది. హిల్లరీ తుపాను ప్రభావంతో కాలిఫోర్మియా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వందేళ్ల రికార్డును తలదన్నుతూ భారీ వర్షపాతం కురిసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hillary Storm: తుపాను బీభత్సానికి అమెరికా రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఉష్ణమండల తుపాను హిల్లరీ ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలతో కాలిపోర్నియా డౌన్‌టౌన్ లాస్ ఏంజిల్స్ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమౌతున్నాయి.
హిల్లరీ తుపాను ప్రభావంతో కాలిఫోర్నియా రాష్ట్రం వణికిపోతోంది. తుపాను కారణంగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. డౌన్‌టౌన్ లాస్ ఏంజిల్స్‌లో రికార్డు స్థాయిలో 1.53 అంగుళాల వర్షపాతం నమోదైంది.1906 తరువాత ఇదే అత్యధిక వర్షపాతంగా తెలుస్తోంది. మరోవైపు లాంగ్ బీచ్ ప్రాంతంలో 1.56 అంగుళాల వర్షపాతం కురిసింది. పామ్ డేల్ విమానాశ్రయం ప్రాంతంలో 2.95 అంగుళాల వర్షం కురిసింది. 1934 తరువాత ఇదే అత్యధికం. ఇక లాంకాస్టర్ ప్రాంతంలో 2.72 అంగుళాల వర్షం నమోదు కాగా 1945 తరువాత ఇదే అత్యధికం.
తుపాను బీభత్సం సృష్టిస్తూ భారీ వర్షాలు కురుస్తుండటంతో నెవాడాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. కాలిఫోర్నియాలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండగా ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అసాదారణమైన వేసవి తుపాను ధాటికి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అటు దక్షిణ కాలిఫోర్నియాలో 5.1 తీవ్రతతో భూకంపం కూడా సంభవించింది. బార్బరా, వెంచురా మధ్య భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
హిల్లరీ తుపాను, భారీ వర్షాల కారణంగా ఏ మేరకు నష్టం వాటిల్లిందనేది ఇంకా తెలియలేదు. లాస్ ఏంజిల్స్ చుట్టుపక్కల ప్రాంతాలు ఒక్కసారిగా వణికిపోయాయి. భారీ వర్షాల సమయంలో భూ ప్రకంపనలు రావడంతో జనం బయటకు పరుగులు తీశారు. వాలెన్సియా ప్రాంతంలో 20 సెకన్ల పాటు భూమి కంపించిందని తెలుస్తోంది. మొదటి భూకంపం తరువాత రెండుసార్లు స్వల్పంగా భూమి కంపించిందని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook