Pakistan Hindu Boy: పాకిస్తాన్ లోని సింధ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. హిందూ సమాజిక వర్గానికి చెందిన ఓ మైనర్ బాలుడిని ఎత్తుకెళ్లి కొందరు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో కాకుండా ఆ బాలుడిని కిరాతకంగా హతమార్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?


బాబర్ లోయి టౌన్ లోని ఖైర్పుర్ మిర్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలుడ్ని శుక్రవారం సాయంత్రం కొందరు దుండగులు ఎత్తుకెళ్లారు. గురునానక్ జన్మదిన వేడుకల్లో బిజీగా ఉన్న బాలుడి కుటుంబం.. ఈ సంగతి గమనించలేదు. అతడిని లైంగికంగా వేధించడమే కాకుండా అతడ్ని కిరతకంగా చంపారు. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో శనివారం బాలుడి మృతదేహం లభ్యమైంది.


ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాబర్ లోయి స్టేషన్ పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. బాలుడి శరీరంపై గాయాలు ఉన్నట్లు శిశు సంక్షేమ సంఘం సభ్యుడు జుబిర్ మహార్ తెలిపారు. సింధ్ రాష్ట్రంలో వారంలో ఇది రెండో ఘటన అన్నారు.


పాకిస్థాన్లోని హిందువులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నట్లు అనేక కథనాలు వచ్చాయి. పాక్లో చిన్నారులపై లైంగిక దాడులూ పెరుగుతున్నాయి.


Also Read: రష్యాలో కరోనా కల్లోలం...రికార్డు స్థాయిలో మరణాలు!


Also Read: గర్భిణీలపై డెల్టా వేరియంట్ ప్రభావం.. గర్భస్థ శిశువులకు ముప్పు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook