న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భయంకరంగా వ్యాప్తి చెందుతున్న కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. ఏ దేశంలో లేనంతగా అమెరికాలో కరోనా బీభత్సంతో 5,61,103 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 22,106 మంది మృత్యువాత పడ్డారు. అయితే, అమెరికాలో కరోనా వ్యాప్తికి ఓ ఔషధ కంపెనీ కారణమని వైద్య విభాగం పేర్కొంటోంది. అమెరికాలో బయోజెన్ అగ్రశ్రేణి ఔషధ తయారీ సంస్థ. కొంతకాలంగా నష్టాలు ఎదుర్కొంటున్న ఆ సంస్థను తాజాగా తయారుచేసిన అల్జీమర్స్ ఔషధం లాభాల బాటపట్టించింది. ఈ క్రమంలో బయోజెన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైకేల్ ఔనాట్సాస్ సమావేశం ఏర్పాటు చేసి కంపెనీ సాధించిన విజయాలపై చర్చించడానికి జరిగిన ఈ సమావేశానికి అమెరికా నలుమూలల నుంచి బయోజెన్ కంపెనీకి చెందిన అనేకమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు కూడా హాజరయ్యారు. అయితే వారిలో కరోనా సోకినవారు ఉండగా లక్షణాలు బయటపడకపోవడంతో సమావేశానికి రావడం, వారు మిగతావారికి సంక్రమించడంతో ఉదృతి పెరిగినట్లు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా ఈ అంశం నుండే అమెరికాలో కరోనా కేసుల పెరుగుదల ప్రారంభమైందని, ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా సంక్రమణ జరిగిందని, బయోజెన్ సమావేశానికి హాజరైంది కొద్దిమందే అయినా, వారు ఈ ఆరు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో విచ్చలవిడి వ్యాప్తి చెందిందని తెలిపారు. ఈ కారణంగానే బయోజెన్ ప్రతినిధులను 'సూపర్ స్ప్రెడర్లు'గా భావిస్తున్నారు.


భారత్ లో ఢిల్లీ మర్కజ్, వైరస్ వ్యాప్తికి కారణమైందో, అమెరికాలో బయోజెన్ సమావేశం 'సూపర్ స్ప్రెడింగ్ ఈవెంట్' గా నిలిచింది. బయోజెన్ సమావేశం అనంతరం 99 మందికి కరోనా నిర్ధారణ కాగా, వారిలో బయోజెన్ ప్రతినిధులు, వారి సంబంధీకులు ఉన్నారు. ఈ సమావేశానంతరం అత్యధిక కేసులు నమోదైనట్టు మసాచుసెట్స్ వైద్య విభాగం పేర్కొంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..