Hungarian President Katalin Novak Resigns: పిల్లల లైంగిక వేధింపుల కేసులో దోషిగా ఉన్న వ్యక్తికి క్షమాభిక్ష మంజూరు చేయడంపై  హంగేరియన్ అధ్యక్షురాలు కటాలిన్ నోవాక్  ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చాలా ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ఘటన ఆమెను ఎంతగానో బాధించిందని సన్నిహితులు పేర్కొంటున్నారు. దీంతో ఆమె వెంటనే తన రాజీనామాను ప్రధానమంత్రి  విక్టర్ ఓర్బన్ కు పంపించారు. ఆమె బాటలోనే..  మాజీ న్యాయ మంత్రి జుడిట్ వర్గా, ఈ వ్యవహారంపై ఆమె ప్రజా జీవితం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Honey Rose: రెడ్ ట్రెండ్ ని ఫాలోఅయిన హనీ రోజ్.. కానీ కొంచెం డిఫరెంట్ గా!


అదే విధంగా.. ఈ ఘటనపై శుక్రవారం సాయంత్రం అధ్యక్ష భవనం వెలుపల ప్రతిపక్ష రాజకీయ నాయకులు, తీవ్ర నిరసనలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రెసిడెంట్ రాజీనామా ప్రకటనలు వెలువడ్డాయని సమాచారం. 46 ఏళ్ల నొవాక్ మాట్లాడుతూ.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన తన మనస్సును బాధించిందన్నారు. 2022 , మార్చి లో.. హంగేరీ  ప్రెసిడెంట్‌గా నోవాక్ క్రియాశీలక పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. 


ఈ కేసులో..  చిల్డ్రన్స్ హోమ్ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌కు అత్యాచార ఘటన దోషికి  క్షమాభిక్ష పెట్టడంతో వివాదం చెలరేగింది. అతను బాధ్యతగల స్థానంలో ఉండి కూడా..  పిల్లలపై  లైంగిక వేధింపులను పాల్పడ్డారని విషయం వెలుగులోకి వచ్చింది. ఇది అప్పట్లో తీవ్ర దుమారంగా మారింది. అయితే..  గత ఏప్రిల్‌లో పోప్ ఫ్రాన్సిస్ బుడాపెస్ట్ పర్యటన సందర్భంగా సదరు దోషికి  క్షమాభిక్ష  ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.


స్థానిక సమాచారం ప్రకారం.. గత వారం నిర్ణయాన్ని వెల్లడించినప్పటి నుండి, దేశంలోని ప్రతిపక్షాలు నోవాక్ రాజీనామాకు పిలుపునిచ్చాయి. శుక్రవారం సాయంత్రం ప్రదర్శనకారులు అధ్యక్ష భవనం వెలుపల గుమిగూడారు.  ముగ్గురు అధ్యక్ష సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. 


ఇదిలా ఉండగా.. శుక్రవారం ప్రపంచ వాటర్ పోలో ఛాంపియన్‌షిప్‌లో కజకిస్తాన్‌తో హంగేరీ మ్యాచ్‌కు హాజరు కావడానికి ఖతార్‌కు వెళ్లిన నోవాక్, మరల తిరిగి బుడాపెస్ట్‌కు తిరిగి వచ్చారు. తన విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆమె తన రాజీనామాను ప్రకటించారు. అత్యాచార దోషికి.. "మంజూరైన క్షమాపణ,  వివరణ లేకపోవడం వల్ల పెడోఫిలియా యొక్క జీరో టాలరెన్స్ గురించి సందేహాలు తలెత్తవచ్చని ఆమె చెప్పింది. హంగేరి ప్రెసిడెంట్ కేటాలిన్ నోవాక్ .. రాజీనామాను ప్రకటించిన కొన్ని నిముషాల తర్వాత..  జుడిట్ వర్గా కూడా ఆమె "ప్రజా జీవితం నుండి వైదొలగుతున్నట్లు" ప్రకటించింది.


ఆమె ఫేస్‌బుక్‌లో మాట్లాడుతూ, "నేను ఎంపీగా,  యూరోపియన్ పార్లమెంటు జాబితాకు అధిపతిగా నా ఆదేశాన్ని త్యజిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. విక్టర్ ఓర్బన్ ఆమోదం లేకుండా హంగేరిలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోబడదని మాకు తెలుసని స్మాల్ లిబరల్ మొమెంటం పార్టీ సభ్యుడు డోనాత్ Facebookలో జోడించారు.


Read More: Tejaswi Madivada: బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ నెవ్వర్‌ బిఫోర్‌ హాట్‌ షో


ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను.. శాంతపరిచే ప్రయత్నంలో, పెడోఫిలె నేరస్థులను క్షమించే అవకాశాన్ని మినహాయించటానికి హంగేరి రాజ్యాంగాన్ని సవరించాలనుకుంటున్నట్లు ఓర్బన్ గురువారం ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటాలిన్ నోవాక్ చెప్పుకొచ్చారు. ఓక చిన్న పిల్లల అనాథశ్రమం నిర్వహిస్తున్న హస్టల్ లో పిల్లలపై జరిగిన అత్యాచార, వేధింపుల ఘటన హంగేరీలో తీవ్ర దుమారంగా మారింది. దీనిలో కొందరిని దోషులుగా ఇప్పటికే కోర్టు ప్రకటించింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook