`మహాత్ముడి విజన్‌ను నేను విశ్వసిస్తాను`: ఒబామా
తన జీవితంలో మహాత్మాగాంధీ ప్రభావం ఎంతుందో చెప్పారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.
జొహెన్నస్‌బర్గ్: తన జీవితంలో మహాత్మాగాంధీ ప్రభావం ఎంతుందో చెప్పారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. నెల్సన్ మండేలా 100వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒబామా.. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం అనే అంశాలు గాంధీ నుంచి నేర్చుకున్నానని చెప్పారు.
2009లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి నల్ల జాతీయుడిగా బరాక్ ఒబామా చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడయ్యాక తన సెనేట్ ఆఫీసులో మహాత్ముడి నిలువెత్తు చిత్రపటాన్ని ఒబామా అలంకరించుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి అందుకొనే సమయంలో కూడా మహాత్ముడి గురించి ప్రసంగంలో మాట్లాడారు.
నెల్సన్ మండేలా 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఒబామా.. తన జీవితంలో మహాత్మాగాంధీ ప్రభావం గురించి మాట్లాడారు. సామాజిక సమానత్వం కోసం మహాత్ముడి విజన్‌ను తాను విశ్వసిస్తానని బరాక్ ఒబామా అన్నారు.
‘‘నేను నెల్సన్ మండేలా విజన్‌ను నమ్ముతాను. అలాగే మహాత్మ గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, అబ్రహమ్ లింకన్‌ల సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ విజన్‌లను నేను నమ్ముతాను. వారి బహుళ జాతి ప్రజాస్వామ్య హక్కులను నేను విశ్వసిస్తాను’’ అని ఒబామా అన్నారు. జీవితానికి సంబంధించిన వాస్తవ సందేశం గురించి మహాత్మాగాంధీ తనకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారని ఒబామా చెప్పారు.