PM Modi speaks to Vladimir Putin: రష్యా, ఉక్రెయిన్ మధ్య హింసను వెంటనే నిలిపివేయాలని.. దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని వ్లాదిమిర్ పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచన చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రత తమకు చాలా ముఖ్యమని చెప్పారు. భారతీయులను సురక్షితంగా ఇక్కడికి రప్పించడమే తమ లక్ష్యం అని మోదీ పేర్కొన్నారు. గురువారం అర్థరాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ఫోన్ కాల్‌లో మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంక్షోభాన్ని రూపుమాపేందుకు భారత్‌ కచ్చితంగా జోక్యం చేసుకోవలంటూ ఉక్రెయిన్‌ విజ్ఞప్తి చేసిన గంటల్లోనే ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్‌ సంభాషణ ప్రస్తుతం చార్చనీయాంశం అయింది. ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రత వ్యవహారాల కేబినెట్‌ కమిటీ గురువారం సమావేశం అయింది. ఈ భేటీలో మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌, పీయూష్‌ గోయల్‌, హర్దీప్‌సింగ్‌ పురి, అజిత్‌ డోభాల్‌ ఉక్రెయిన్‌ పరిస్థితులపై చర్చించారు. ఈ వివరాలను విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా మీడియాకు తెలిపారు. 


'రష్యా, ఉక్రెయిన్ మధ్య హింసను వెంటనే నిలిపివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకూ భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ప్రధాని వారికి చెప్పారు. ఉక్రెయిన్‌లో సుమారు 20 వేల మంది భారతీయులు ఉండగా.. దాదాపు 4 వేల మంది అక్కడి బార్డర్ దాటారు. మిగిలిన వారి భద్రతకు, వారిని సురక్షితంగా తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మోదీ చెప్పారు' అని హర్షవర్ధన్‌ శ్రింగ్లా చెప్పారు. 


ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తీసుకొచ్చే విషయమై రుమేనియా, స్లొవేకియా, పోలండ్‌, హంగేరీ విదేశాంగ మంత్రులతో జైశంకర్‌ చర్చించనున్నట్టు హర్షవర్ధన్‌ శ్రింగ్లా వెల్లడించారు. ష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ పౌర విమానయానాన్ని రద్దుచేయడమే కాకుండా  గగనతలాన్ని మూసివేసింది. దాంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కు తీసుకొచ్చేందుకు భారత కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.


Also Read: IPL 2022: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఐపీఎల్ 2022కు ముహూర్తం ఖరారు! ప్రేక్షకులకు అనుమతి!!


Also Read: Reena Dwivedi New Look: అప్పుడు ఎల్లో సారీ.. ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్‌! ఈ ఎలక్షన్ ఆఫీసర్‌ది చూపుతిప్పుకోని అందం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook