Immigrants Ukrainian Womens: దారుణం.. ఉక్రెయిన్ మహిళలపై పొరుగు దేశాల అధికారులు లైంగిక దాడులు..?
సాయం చేయాల్సిన ఉక్రెయిన్ ఇరుగు పొరుగు దేశాల అధికారులు వారి నిస్సహాయతను ఆసరా చేసుకుని లైంగిక దాడులకు తెగబడుతున్నట్లు ఉక్రెయిన్ మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. మహిళలకు పిల్లలకు సరిహద్దుల్లో సాయం అందక, ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
Immigrants Ukrainian Women: ఉక్రెయిన్ పౌరులు యుద్ధ ప్రభావంతో తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఐరోపా, పోలాండ్, ఇతర దేశాలకు వెళ్తున్నారు. రష్యా దాడిపై ఇప్పుడిప్పుడే పలుదేశాల అధినేతలు స్పందిస్తున్నారు. గతంలో రష్యాతో మంచి సంబంధాలున్న దేశాలు కూడా ఇప్పుడు ఉక్రెయిన్‌కు సహాయం చేయడం విశేషం. యుద్ధంలో ఆస్తినష్టంతో విలవిలాడుతున్న ఉక్రెయిన్ చూసి పలు దేశాలు సహాయ కార్యక్రమాల కూడా చేపడుతున్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్‌లో 79 మంది పిల్లలు మరణించారని అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్‌లోని యువత తమ దేశానికి సేవ చేసేందుకు యుద్ధరిత్యా దేశంలో ఉండి.. మహిళలను పిల్లలను సురక్షితంగా రక్షించుకుంటున్నారు. కానీ అన్ని కోల్పోయిన మహిళలు, పిల్లలు దేశ సరిహద్దుల్లో సరైన సంరక్షణ లేక కొట్టుమిట్టాడుతున్నారు. లైంగిక దాడులతో శవాళ్ల మారుతున్నారు. సాయం చేయాల్సిన ఇరుగు పొరుగు దేశాల అధికారులు వారి నిస్సహాయతను ఆసరా చేసుకుని లైంగిక దాడులకు తెగబడుతున్నట్లు ఉక్రెయిన్ మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. మహిళలకు పిల్లలకు సరిహద్దుల్లో సాయం అందక, ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
పుతిన్ చర్యలకు చెక్ పెట్టాడానికి అగ్రరాజ్యాలు రష్యాపై పలు ఆంక్షలు విధించినప్పటికీ అవేవి లెక్కచేయకుండా, యుద్ధంతో దూసుకెళ్తున్నారు. యుద్ధంలో 13800 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. వందలాది మంది రష్యన్ సైనికులు ఉక్రెయిన్ దళాలకు బంధీలుగా పట్టుబడ్డారు. యుద్ధానికి పుతిన్‌కు వ్యతిరేకంగా రష్యాలోనూ నిరసనలను వ్యక్తమవుతున్నాయి. కానీ దానిని ఖాతరు చేయకుండా యుద్ధాన్ని ముందుకు నడిపిస్తున్నాడు.
యుద్ధం ఇలానే కొనసాగితే ఉక్రెయిన్‌కు భారీ నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని ప్రపంచ దేశ నిపుణులు చెబుతున్నారు. అయితే రష్యా కూడా యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని పలు సందర్భాల్లో తెల్చిచెప్పింది. దిన్ని బట్టి చూస్తే యుద్ధం మరింత ఉధృక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రష్యా కొనసాగిస్తున్న భీకర యుద్ధంలో ఉక్రెయిన్ బలగాలు కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి.
ఈ యుద్ధంలో 1375 సాయుధ శకటాలు, 108 హెలికాప్టర్లు, 430 యుద్ధ ట్యాంకులు, 84 విమానాలు, 819 వాహనాలు, 60 ఇంధన ట్యాంకులతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అయితే దిక్కుతోచని స్థితిలో ఉన్న ఉక్రెయిన్‌ను చూసి పలు దేశాలు సహకారాన్ని ప్రకటిస్తున్నాయి. ఇటివలే అమెరికా కూడా ఉక్రెయిన్‌కు 800 మిలియన్ డాలర్ల విలువ చేసే సైనిక సహకారం అందించింది. ఈ విషయాన్ని బైడెన్ కార్యవర్గం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్‌కు 13.6 బిలియన్ డాలర్లు సమకూర్చాలన్న బిల్లుపై సంతకం కూడా చేశారు.
Also Read: Stocks today: స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు- సెన్సెక్స్ 1040 ప్లస్
Also Read: IND vs ENG: వరల్డ్ కప్ లో టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ.. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో ఓటమి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook