భారత్‌పై నోరు పారేసుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
భారత్‌పై నోరు పారేసుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్‌తో భారత్ చర్చలు రద్దు చేసుకోవడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అసహనం వ్యక్తంచేశారు. భారత్‌ని పరిపాలిస్తున్న వారికి ముందుచూపు లేదని ఇమ్రాన్ ఖాన్ ఎద్దేవా చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం వచ్చే వారం న్యూయార్క్‌లో జరగనున్న ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ భేటీ సందర్భంగా భారత్-పాక్ విదేశాంగ శాఖ మంత్రులు సమావేశం కావాల్సి ఉంది. అయితే, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల చేతిలో కాశ్మీర్‌లోని ముగ్గురు పోలీసు సిబ్బంది దారుణ హత్యకు గురవడానికి నిరసనగా ఆ మరుసటి రోజే పాక్ విదేశాంగ శాఖతో జరగాల్సి ఉన్న చర్చలను భారత్ రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాను ఓవైపు భారత్‌తో చర్చలు పునరుద్దరించాలని కోరుతుంటే, భారత్ పాక్‌తో చర్చలను రద్దు చేసుకుందని గుర్తుచేస్తూ.. "తన జీవితంలో ముందు చూపు లేకుండా పెద్ద పెద్ద పదవుల్లో కొనసాగినవాళ్లను ఎంతో మందిని చూశాను" అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.