Capital Punishment in Saudi: నేరాలలకు పాల్పడిన దోషులను కొన్ని దేశాలు కఠినంగా క్షించడం వారి ధర్మం. మరి కొన్ని దేశాలేమో నేరాన్ని ఒప్పుకున్నవారిని వదిలేయడం వారి ధర్మం, అరబ్‌ కంట్రీ లాంటీ దేశాల్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని అందరికీ తెలుసు. ఇటివలే కాలంలో సౌదీ అరేబియాలో సామూహికంగా మరణశిక్ష అమలు చేసింది అక్కడి ప్రభుత్వం. హత్యలు, ఉగ్రవాదం, దొంగతనాలు వంటి నేరాలు చేసిన 81 మందికి సామూహికంగా మరణశిక్ష అమలు చేసింది. ఇది అధునిక చరిత్రలోనే  అతిపెద్ద సామూహిక మరణశిక్షల అమలు చర్యగా పలు దేశాలు చేబుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ శిక్షలో 1979లో మక్కా మసీదును స్వాధీనంలో దోషులుగా ఉన్న 63 మంది ఉగ్రవాదులకు, 1980 జనవరిలో సామూహిక మరణశిక్ష అమలు చేసింది అరబ్‌ ప్రభుత్వం. మొత్తం 81 మంది దోషుల్లో వీరే 63 మంది ఉన్నట్లు సమాచారం. అరబ్‌ దేశాల్లో చాలా దేశాలు సామూహిక మరణశిక్ష విధించాయి, కానీ ఇప్పటి వరకు విధించిన దేశాల శిక్షల్లో ఇది చరిత్రలో అతిపెద్ద సామూహిక మరణశిక్షల అమలు చర్యగా కావడం విశేషం. 


ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే సౌదీ ప్రెస్‌ ఏజెన్సీలు తాజా మరణశిక్షల గురించి ప్రకటించాయి. నిందితుల్లో చాలా మంది అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ ఉగ్రవాదులతోపాటు యెమన్‌లోని హౌతి తిరుగుబాటు దళాల మద్దతుదారులు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. కరుడు కట్టిన ఉగ్రమూకలకు కూడా శిక్ష వేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. హత్యలు, ఉగ్రవాదం, దొంగతనాలు పునరావృతం కాకుండానే ఇలాంటి శిక్షలు విధిస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ మరణశిక్షల విషయానికి వస్తే ఎక్కడ.. ఎలా అమలు చేశారన్న వివరాలు ప్రభుత్వం వెల్లడించలేదు.


Also Read: Missiles attack: అమెరికా దౌత్య కార్యాలయంపై మిస్సైల్ దాడులు!


Also Read: India vs Srilanka: బెంగళూరు టెస్ట్‌లో సరికొత్త రికార్డు, ఏకంగా 16 వికెట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook