Indo China tensions: భారత్, చైనా సరిహద్దుల్లో ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలను పొరుగు దేశమైన రష్యా ( Russia ) ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. సరిహద్దు వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు ఇరు దేశాలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయని రష్యా అభిప్రాయపడింది. గాల్వన్ లోయలో భారత్, చైనా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో ( Galwan face off ) భారత్‌కి చెందిన 20 మంది సైనికులు అమరులైన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలు కృషి చేస్తుండటం అభినందించదగిన విషయమని రష్యా పేర్కొంది. తమ భాగస్వాములు అందరితో తాము టచ్‌లోనే ఉన్నామని.. భౌగోళికంగా రాజకీయాలు చేయడం రష్యాకు ఇష్టం లేదని అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జీ మీడియాకు చెందిన గ్లోబల్ న్యూస్ ఛానెల్ వియాన్‌కి ( Wion news) ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా అధికారవర్గాలు ఈ వ్యాఖ్యలు చేశాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: PM Modi`s Ladakh visit: ప్రధాని లఢక్ పర్యటనపై స్పందించిన చైనా


భారత్, చైనా మధ్య ఈ విషయంలో కలగజేసుకోవడం తమకు ఇష్టం లేదన్న రష్యా స్పష్టంచేసింది. ఈ వివాదంలో ఇరుదేశాల మధ్య రష్యా సదుద్దేశంతో జోక్యం చేసుకున్నా.. అది మరోలా పనిచేసే ప్రమాదం లేకపోలేదని.. అప్పుడు ఆ రెండు దేశాలు చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు దెబ్బతింటాయని రష్యా అభిప్రాయపడింది. గత వారం రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గె లవ్రోవ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. Russian victory day parade: రష్యన్ విక్టరీ డే పేరేడ్‌లో ఇండియా దేనికి సంకేతం ? )