Greta Thunberg: ఇండియా కరోనా మహమ్మారికి  కేంద్రంగా మారింది. కోవిడ్ వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. ఆక్సిజన్ అందక రోగుల ప్రాణాలు గాలిలోనే కల్సిపోతున్నాయి. ఇండియాలో కరోనా పరిస్థితులపై స్పందించిన ప్రముఖ పర్యావరణ హక్కుల కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్..ప్రపంచదేశాలు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) తీవ్రతరమవుతోంది. వరుసగా నాలుగు రోజుల్నించి 3 లక్షల కేసులు నమోదవుతుంటే..రెండ్రోజుల్నించి 3.5 లక్షల కేసులకు చేరువలో ఉంది. ఆక్సిజన్, బెడ్స్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత ( Remdesivir Injections Shortage)తో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆక్సిజన్ అందక ( Oxygen Shortage) కోవిడ్ రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇండియాలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ప్రపంచ పర్యావరణ హక్కుల కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్ ( Greta Thunberg) స్పందించారు. ఇండియా పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విపత్కర సమయంలో ఇండియాకు ప్రపంచదేశాలు సహాయం చేయాలని గ్రేటా కోరారు.


ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ విధ్వంసం అంతా ఇంతా కాదు. ఫస్ట్ వేవ్‌ను దాటేసింది. గత 24 గంటల్లో కొత్తగా 3 లక్షల 49 వేల కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌..ఫస్ట్‌ వేవ్‌ మించి విధ్వంసం సృష్టిస్తోందనే చెప్పాలి. భారత్‌‌ ప్రస్తుతం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఈ ఆపద నుంచి బయట పడటానికి ప్రపంచ దేశాలు ( Global Community must help india) భారత్‌కు సహాయం చేయాలని గ్రేటా థన్‌బర్గ్ విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో కరోనా కారణంగా జరుగుతున్న దారుణ పరిణామాలను చూసి ఇండియాకు అవసరమైన సహాయాన్ని వెంటనే ప్రపంచ దేశాలు అందించాలంటూ గ్రేటా ట్వీట్ చేశారు.


Also read: India Coronavirus update: ఇండియాలో కరోనా పరిస్థితులపై స్పందించిన అమెరికా, ఫ్రాన్స్ దేశాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook