ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రతీ సంవత్సరం సంతోషంగా ఉండే దేశాల జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఈ జాబితాలో అతి చిన్నదేశం ఫిన్లాండ్ తొలి స్థానంలో ఉండగా.. నార్వే, డెన్మార్క్, ఐస్ ల్యాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, కెనడా, న్యూజిలాండ్, స్వీడన్, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయిత ప్రపంచంలోని అత్యున్నత  ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన  భారత్ మాత్రం కేవలం 133వ స్థానంతో సరిపెట్టుకుంది.


ఈ జాబితాలో భారత్ కన్నా చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక దేశాలు చాలా ముందు వరుసలో ఉండడం గమనార్హం. పాకిస్తాన్ అయితే అనేక రెట్లు మెరుగైన ఫలితాన్ని పొంది 75వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా అవినీతిపరుల సంఖ్య, ప్రజల ఆయుర్దాయం, జీవన విధానం, పర్యావరణ పరిరక్షణ మొదలైన అంశాలను ని పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులను ప్రకటించడం జరిగింది. ఈ సారి ఈ జాబితాలో 152 దేశాలకు స్థానాన్ని కల్పించింది ఐక్యరాజసమితి.