పొరుగు దేశం బంగ్లాదేశ్, భారత స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)ల ప్రవేశానికి నో చెప్పింది. ఢాకా స్టాక్ ఎక్సేంజ్ (డీఎస్ఈ)లో వాటా కోసం దేశీయ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ), అమెరికాకు చెందిన నాస్ డాక్ స్టాక్ ఎక్సేంజ్ తోపాటు బంగ్లాదేశ్ కు చెందిన ఫ్రాంటియర్ బంగ్లాదేశ్ తో కూడిన కన్సార్టియం బిడ్ వేయగా.. దీన్ని కాదని చైనాకు చెందిన కన్సార్టియంకు 25 శాతం వాటా ఇచ్చేందుకు బంగ్లా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్ఎస్ఈతో కూడిన కన్సార్టియం, ఢాకా స్టాక్ ఎక్సేంజ్ లో వాటా కోసం ఒక్కో షేరుకి 15 టాకాలు చెల్లిస్తామని చెప్పగా, చైనా కన్సార్టియం 22 టాకాలను ఆఫర్ చేసింది. దీంతో డీఎస్ఈ డైరెక్టర్లు చైనా కన్సార్టియానికే మొగ్గు చూపారు. ఆర్థిక, టెక్నాలజీ అంశాల పరంగా చైనా బిడ్ ఆమోదీనీయంగా ఉందని పేర్కొన్నారు.


ఈ విషయమై భారత జర్నలిస్టుల బృందం, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను అడగ్గా.. ‘‘మా ప్రభుత్వం బంగ్లా అభివృద్ధి గురించే ఆలోచిస్తోంది. అందుకే దేశాభివృద్ధికి సహకారం అందించే ఏ దేశంతో అయినా కలసి నడుస్తాం. మాకు పెట్టుబడులు, సహకారం ముఖ్యం. అది ఎవరు అందించినా సరే. వారితో ప్రయాణిస్తాం. మేము బంగ్లా అభివృద్ధిని కోరుకుంటున్నాం. దేశ ప్రజల గురించే మేము ఆలోచించాల్సి ఉంటుంది’’ అని చెప్పారు.