చైనా, పాక్, విరుసుతున్న సవాళ్లకు భారత్ దీటుగా ఎదుర్కొంటోంది. గతంలో జరిగిన ఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకొని పదునైన వ్యూహాలతో ముందుకు దూసుకెళ్తోంది. చైనా-పాక్‌లు భారత్‌కు ప్రధాన ముప్పుగా పరిణమించడంతో ఆయుధసంపత్తిపై దృష్టిపెట్టింది. రక్షణ రంగం దగ్గర నుంచి విదేశాంగ విధానంగా వరకు తమ పాత పద్దతులకు స్వస్తి పలికి..సరికొత్త పంథాతో ముందుకు కదులుతోంది. పాక్‌ వైపు నుంచి కవ్వింపు చర్యలు పెరుగుతుండగా.. మరోపక్క చైనా కూడా దుందుడుకు వైఖరిని అవలంభిస్తోన్న విషయం తెలిసిందే. సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్నఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని భారత్ ముందజాగ్రతతో వ్యవహరిస్తోంది. ఏ సమయంలోనైనా ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టాలనే లక్ష్యంతో ముందుకు కదులుతోంది. భారత్ అనుసరిస్తున్న విధానాలతో శత్రుదేశాలైన పాక్,చైనా దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సైనిక ఆధునికీకరణ...రక్షణ రంగం బలోపేతం


రక్షణ రంగం బలోపేతం విషయంలో గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలకు స్వస్తి పలికి ..దూకుడుగా వ్యవహరించాలని భారత్ నిర్ణయించింది. సైనిక ఆధునీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది మోడీ సర్కార్. గతంలో రక్షణ కీలక ప్రాజెక్టులకు సంబంధించిన కొనుగోళ్లు.. అనుమతుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకునేది. ఒక ఆయుధ కొనుగోలు ఒప్పందం కుదిరితే అది సైన్యం చేతికి వచ్చేందుకు కొన్నేళ్లు పట్టేది. అయితే ఇలాంటి విధానాలకు స్వప్తి పలుకుతూ మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రాజెక్టులకు సంబంధించిన కొనుగోళ్లు అనుమతుల్లో జాప్యానికి ఏ మాత్రం తావులేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. దేశీయంగానే ఆయుధ తయారీకి ప్రాధాన్యమిస్తూ ఇస్తోంది. రక్షణ కొనుగోళ్లు, ఆయుధ అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలను ఆయా శాఖలకు బదిలీ చేస్తోంది. 


సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం వేగవంతం..


భారత్‌-చైనా సరిహద్దుల్లోని ఈశాన్యరాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ అత్యంత నాసిరకంగా ఉంది. ఇక్కడ మొత్తం కొండలు, గుట్టలతో ఉండటంతో నిర్మాణం కష్టసాధ్యంగా మారింది. అదే చైనా మాత్రం భారత సరిహద్దు వరకు బ్రహ్మాండమైన రోడ్డు, రైల్వే వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంది. భారత్ వైపు వాహనాలు 30 కి.మీ కంటే ఎక్కువ వెళ్లలేవు. అదే చైనా వైపు వాహనాలు గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణించగలవు. ఒక వేళ డోక్లామ్‌ వివాదం ముదిరి యుద్దం పరిస్థితులు నెలకొంటే వాహనాలు, సైన్యం తరలింపు విషయంలో చైనా మెరుగ్గా ఉంది. ఈ పరిస్థితిని గమనించి మోడీ సర్కార్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. రవాణాశాఖ పరిధిలో ఉన్న 60కిపైగా ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి 3.5 వేల కి.మీ మేర ఎక్స్ ప్రెస్ హైవేలను ఏర్పాటు చేయాలని భారత్ ప్రభుత్వం సంకల్పించింది. 


దూకుడైన విదేశాంగ విధానం...


గతంలో భారత్ శత్రువుల విషయంలో కాస్త మెతక ధోరణిలో వ్యవహరించేది. శత్రును రెచ్చగోట్టే చర్యలకు దూరంగా ఉంటూ రక్షణాత్మక ధోరణిలో ఉండేది. అయితే ఇప్పడు పరిస్థితి మారింది. శత్రువుకు శత్రవు మిత్రుడే అన్న ధోరణిలో వ్యవహరిస్తోంది. డోక్లామ్‌ వివాదానికి ముందు మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా తలపెట్టిన నావికాదళ విన్యాసాల్లో పాల్గొనలేదు. చైనా శత్రువైన జపాన్‌, అమెరికాలు దీనిలో పాల్గొనటమే కారణం. అప్పటికే దక్షిణ చైనా సముద్రం విషయంలో ఆయా దేశాల మధ్య వివాదం రగులుతోంది. చైనాతో ఉద్రిక్తతలు పెంచుకునే ఉద్దేశం లేకపోవడంతో భారత్‌ వీటికి దూరంగా ఉంది. 


కానీ డోక్లామ్ వివాదం ప్రారంభకాగానే భారత్ తన వైఖరిని అమాంతంగా మార్చకుంది. శాంతి నెలకొల్పేందుకు ముందుకొస్తే సరే.. లేకుంటే దేనికైనా రెడీ అన్న రీతిలో వ్యవహరిస్తోంది. జపాన్‌తో కలిసి మలబార్‌ నావికాదళ విన్యాసాల్లో భారత్‌ పాల్గొనడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు పాక్ శత్రుదేశంగా భావించే ఇజ్రాయిల్ లో ప్రధాని మోడీ పర్యటించి ఆ దేశంతో పలు రక్షణ ఒప్పందాల చేసుకోవడం.. అలాగే  చైనాకు శత్రుదేశంగా భావించే అమెరికాతో సత్సంబంధాలు నెరపడం వంటి విధానాలను భారత్ అవలంభిస్తోంది. వీటికి తోడు త్వరలో రష్యాతో కూడా కలిసి సైనిక విన్యాసాలను నిర్వహించాలని నిర్ణయించింది. తాజా పరిణాామాలు భారత్ దూకుడు ఈ పాటిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


ఓటమి నేర్పిన పాఠాలు...


1962 నాటి ఓటమితో భారత్ గుణపాఠాలు నేర్చకుంటూ వచ్చింది. చైనా చేతిలో  ఓటమి తర్వాత చైనాతో వివాదాల జోలికి పోకుండా రక్షణాత్మక వైఖరి అవలభించింది. అడపాదడపా భారత్‌ భూభాగాల్లోకి చైనా  చొరబడటం.. వెనక్కి వెళ్లటం మినహా పెద్ద సంఘటనలు ఏవీ చోటు చేసుకోలేదు. మరోవైపు పాక్ విషయంలో భారత్ భిన్నంగా..దూకుడైన వ్యూహంతో వ్యవహరిస్తూ వచ్చింది. చైనా యుద్ధం ముగిశాక పాక్‌తో యుద్ధాలు జరిగినా వాటిల్లో భారత్‌ సునాయాసంగా విజయం సాధించడమే ఇందుకు ఉదాహరణ. ఇప్పడు పరిస్థితులు మారాయి..ఇప్పుడు ఒకప్పటి భారత్ కాదు.. ఓటమి నుంచి గుఠపాఠాలు నేర్చుకుంది. సరైన సమయంలో సరైన వ్యూహాలు రచించి ఎంతటి శత్రవునైనా దెబ్బకొట్టే సామర్ధ్యం ఇప్పుడు భారత్ దగ్గర ఉంది. ప్రస్తుతం చైనా,పాక్ విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరే ఇందుకు నిదర్శనం.


శత్రు దేశాలు ఉక్కరి బిక్కిరి...


గతం కంటే భిన్నంగా ..ఎవరూ ఊహించని రీతిలో భారత్ అడుగులు వేస్తుండంతో శుత్ర దేశాలైన చైనా, పాక్ దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇది 1962 నాటి  భారత్ కాదని ఆ దేశాలకు ఇప్పడిప్పుడే తెలుసుకుంటున్నాయి. ఓటమి నుంచి గుఠపాఠాలు నేర్చకొని ముందు జాగ్రతతో వ్యవహరించడమే భారత్ బలమైన స్థితికి  కారణమని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎదురుదెబ్బలు తిన్న మనిషి కచ్చితంగా రాటుదేలుతాడు. ఇది దేశాలకు కూడా వర్తిస్తుంది.. ప్రస్తుతం మన దేశం పరిస్థితి కూడా ఇలానే ఉంది కదూ.