Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధానంతర పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఆఫ్ఘన్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో పొరుగుదేశం ఇండియా..మానవత్వాన్ని చాటుతోంది. భారీగా గోధుమల్ని తరలిస్తోంది. ఆ వివరాలిలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆకలితో అల్లాడుతున్న ఆప్ఘన్‌ ప్రజలను భారత్‌ మానవతా దృక్పథంతో ఆదుకుంటోంది. ముందు ప్రకటించినట్టుగానే 50 వేల మెట్రిక్‌ టన్నుల గోధుమలను ఆప్ఘన్‌‌కు తరలిస్తోంది భారతప్రభుత్వం. తాజాగా 2 వేల మెట్రిక్‌ టన్నుల గోధుమలను పాకిస్తాన్‌ మీదుగా ఆప్ఘన్‌‌కు తరలించింది. 


తాలిబన్‌ చేతుల్లో చిక్కిన ఆప్ఘనిస్తాన్‌‌లో తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో ఆకలి చావులు నానాటికీ పెరిగిపోతున్నాయి. పూటగడవడం కోసం ఆప్ఘన్‌ ప్రజలు ఎన్నో తిప్పలు పడుతున్నారు. అసలే అరకొర పంటలతో ఎప్పుడు ఆహార కొరతను ఎదుర్కొనే ఆఫ్ఘన్..తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకోవడంతో మరింత విషమంగా మారింది. ఆహారనిల్వలను తాలిబన్లు చేజిక్కుంచుకోవడంతో అక్కడి ప్రజలు ఆకలి కోసం అలమటిస్తున్నారు. ఇక చిన్నారుల పరిస్థితి గురించి మరీ దయనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆప్ఘనిస్తాన్‌‌కు ఆహార పదార్ధాలను సాయంగా అందజేయాలని గతేడాది అక్టోబర్‌‌లోనే నిర్ణయం తీసుకుంది. 50 వేల మెట్రిక్‌ టన్నుల గోదుమలను సాయంగా అందిస్తామని ప్రకటించింది. 


50 వేల మెట్రిక్‌ టన్నుల గోధుమల పంపిణీ కార్యక్రమాన్ని ఇండియా వేగవంతం చేసింది. ఇండియా నుంచి గోదుమలను తరలించేందుకు పాకిస్తాన్‌ మీదుగా వాహనాలు వెళ్తున్నాయి. దీనికి సంబంధించి 2021 అక్టోబర్‌ 7వ తేదీన భారత ప్రభుత్వం పాకిస్థాన్‌‌కు గోధుమల తరలింపు వాహనాలకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఇందుకు పాకిస్తాన్‌ తొలుత నిరాకరించినా.. చివరకు నవంబర్‌ 7వ తేదీన అంగీకారం తెలిపింది. దీంతో 2500 మెట్రిక్‌ టన్నుల తొలి షిప్‌‌మెంట్‌ ఫిబ్రవరి 22న ఆప్ఘన్‌‌కు బయలుదేరింది. ఫిబ్రవరి 26న ఆప్ఘన్‌‌లోని జలదాబాద్‌ సిటీ చేరుకుంది. ఇక తాజాగా 2 వేల మెట్రిక్‌ టన్నులతో కూడిన నాలుగో షిప్‌‌మెంట్‌ మంగళవారం పాకిస్తాన్‌ మీదుగా ఆప్ఘన్‌‌కు బయలుదేరింది. ప్రతి బ్యాగ్‌ పైనా కూడా గిఫ్ట్‌ ఫ్రమ్‌ ది పీపుల్‌ ఆఫ్‌ ఇండియా టు ది పీపుల్‌ ఆఫ్‌ ఆప్ఘనిస్తాన్‌ అని ఇంగ్లీష్‌‌లో రాశారు. మొత్తంగా 50 వేల మెట్రిక్‌ టన్నుల సాయంలో భాగంగా ఇప్పటివరకు భారత్‌.. 8 వేల మెట్రిక్‌ టన్నుల  గోధుమలను ఆప్ఘన్‌‌కు చేరవేసింది.


Also read: China Corona Cases: దేశంలో మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు.. భయం గుప్పిట్లో చైనా ప్రజలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook