భారత ప్రభుత్వం ఇటీవలే కంబోడియా ప్రభుత్వంతో ఎంఓయూ (మెమొరెండం ఆఫ్ అండర్ స్టాండింగ్) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆ దేశంలోని పురాతన శివాలయానికి మరమ్మత్తులు చేయించే క్రమంలో భారత్ కూడా ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపింది.  ఈ మేరకు జరిగిన చర్చా సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు కంబోడియా విదేశాంగ మంత్రి ప్రాక్ సోకోన్ కూడా పాల్గొన్నారు. కంబోడియాలోని ప్రే విహార్ ప్రాంతంలో ఉన్న ఈ శివుని ఆలయం 11వ శతాబ్దం కాలం నాటిదని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూనెస్కో ఇచ్చిన నివేదిక మేరకు ఈ పురాతన శివాలయానికి అనుబంధంగా ఎన్నో రహస్య మార్గాలు ఉన్నాయని తెలుస్తోంది. కంబోడియాలో ప్రఖ్యాత శిల్పకళాకారులైన ఖేమర్ ఆర్కిటెక్టులు ఆ ఆలయాన్ని నిర్మించారని సమాచారం. రిమోట్ ప్రాంతంలో ఈ ఆలయం ఉండడం వల్ల శిల్పకళారీతులు చెక్కు చెదరకుండా ఉన్నాయని.. పూర్తిస్థాయిలో ఆలయాన్ని పునరుద్ధరించాక.. పర్యాటకంగా కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కాంబోడియా ప్రభుత్వం తెలిపింది. 


ప్రస్తుతం కంబోడియాలో తరవాడ బుద్దిజం మతాన్ని ఎక్కువమంది ప్రజలు అవలంబిస్తున్నారు. ఈ మతస్థుల తర్వాత ఎక్కువశాతం హిందువులే ఈ దేశంలో ఉండడం గమనార్హం. రామాయణం వంటి హిందూ గ్రంథాలు కూడా కంబోడియాలో వారి భాషలో తాళపత్రాల రూపంలో లభ్యమవుతున్నాయి. వియత్నాం యుద్ధం కంబోడియా వరకు విస్తరించిన తరువాత అవతరించిన " ఖేమర్ రోగ్ " పార్టీ, 1975 నాటికి కంబోడియాను వశపరచుకుకుంది. కొన్ని సంవత్సరాల తరువాత కంబోడియా తిరిగి సోషలిస్ట్ భావ ప్రభావితమైన " పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కంబోడియా"తో విలీనమైంది. 1993 వరకూ ఇలా కొనసాగిన తరువాత, ఏకాంతం వీడి 1993లో యుద్ధవినాశిత దేశమైన కంబోడియా సమైక్య సామ్రాజ్యంగా అవతరించింది.