2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను అధిగమించే అవకాశం
2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ తాజా నివేదికలో పేర్కొంది. జపాన్ అధిగమించి.. భారత్ ముందుకు వెల్లండిందని సమాచారం. ఆ వివరాలు..
2030 నాటికి జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ ఆర్థిక జాబితాలో భారత్ గణనీయంగా దూసుకెళ్తోందని తెలిపింది. S&P విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతదేశ GDP రెట్టింపు అవుతుందని, 2022లో $3.5 ట్రిలియన్లకు చేరుకోగా.. ఈ దశాబ్దం చివరినాటికి $7.3 ట్రిలియన్లకు చేరుకోనుందని తెలిపింది.
"ఈ వేగవంతమైన ఆర్థిక విస్తరణ ఫలితంగా 2030 నాటికి భారత జిడిపి పరిమాణం.. జపాన్ జిడిపిని మించిపోనుంది. ఫలితంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది" అని నివేదిక పేర్కొంది.
నివేదిక ప్రకారం.. భారత్ లో అనుకూలమైన దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తూ, గడిచిన 10 సంవత్సరాలలో విదేశీ డైరెక్ట్ పెట్టుబడుల ప్రవాహాలు గణనీయంగా పెరగడంతో భారతదేశ ఆర్థిక వృద్ధికి కారణమని పేర్కొంది.
భారత్ లో యువత సంఖ్య అధికంగా ఉండటం మరియు సగటు వ్యక్తిగత ఆదాయం పెరగటమే భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారటానికి ముఖ్య కారణమని నివేదికలో తెలిపారు.
2022 నాటికి, భారతదేశం యునైటెడ్ కింగ్‌డమ్ మరియు ఫ్రాన్స్ రెండింటి జిడిపిని అధిగమించింది. 2030 నాటికి, భారతదేశం యొక్క GDP కూడా జర్మనీ GDPని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.
Also Read: Telangana Elections: తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఖరారైనట్టేనా, జనసేన సీట్లేవి
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ అంచనాల ప్రకారం.. జపాన్ నామమాత్రపు GDPని ఈ సంవత్సరం జర్మనీ అధిగమించగలదని.. ఫలితంగా US డాలర్ ఆధారంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జపాన్ మూడవ స్థానం నుండి నాల్గవ స్థానానికి పడిపోయిందని అంచనా వేస్తున్నారు.
ఈ నివేదికలో ప్రపంచ ఆర్థిక వాతావరణం యొక్క కొనసాగుతున్న క్షీణతను దృష్టిలో ఉంచుకొని.. జనవరి నుండి కొత్త ఆర్డర్‌లు ఒప్పందం కుదుర్చుకోవడం.. చేసే పనిలో గణనీయ తగ్గుదల వంటి వస్తున్న బలహీన సంకేతాల దృష్ట.. వచ్చే నెలల్లో సంభావ్య ఇబ్బందులు ఎదుర్కోనున్నట్లు నివేదికలో వెల్లడించబడింది.
Also Read: SA vs ENG: చెలరేగిన సఫారీ బ్యాటర్లు.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి