ఇమ్రాన్ ఖాన్ `జిహాద్` వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత ఆర్మీ చీఫ్ !!
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఘాటుగా స్పందించారు.
ఢిల్లీ: కశ్మీరీలు చేస్తున్నది పవిత్ర యుద్ధమని (జిహాద్)..ఆ పోరాటానికి మద్దతు ఇస్తామని బహిరంగ ప్రకటన చేసిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు కలకలం రేగుతున్నాయి. ఆయన వ్యాఖ్యలకు కశ్మీర్ లో హింసకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు బహిరంగ మద్దతు ప్రకటించేలా ఉన్నాయని భారత్ మండిపడుతోంది. ఈ సందర్బంగా భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కయ్యానికి కాలుదువ్వే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహాద్ పేరుతో పాకిస్తాన్ సర్కార్ కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని దయ్యబట్టారు.
భారత్ తో యుద్దం చేయడమే పాక్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అదే నిజమైతే ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. వాస్తవానికి తాము సరిహద్దుల దాటి రావాలంటే పెద్ద కష్టమైన పని కాదని.. ఈ విషయంలో గతంలో సర్జికల్ స్ట్రయిక్స్ రూపంలో నిరూపించామన్నారు. పాక్ దుశ్చర్యలు రోజు రోజుకు హద్దులు మీరుతున్నాయి..ఇక దాని ఆగలు సాగనివ్వబోమని తీవ్ర స్థాయిలో భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మండిపడ్డారు.
పాక్ ప్రధాని అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరు మద్దతిచ్చినా లేకపోయినా తాము మాత్రం కశ్మీరీ పోరాటానికి మద్దతుగా నిలుస్తామన్నారు. కశ్మీరీలు చేస్తున్నది జిహాద్ అని..వారికి మద్దతు పలకడం కూడా జీహాద్ గానే పరిగణించాల్సి ఉందన్నారు. కశ్మీరీలకు పాక్ ప్రజలు అండగా నిలిస్తే విజయం సాధింగలమన్నారు. జిహాద్ ప్రస్తావన తీసుకొచ్చి ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నారు. భారత్ తో పాటు ప్రపంచ దేశాలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో స్పందించిన భారత ఆర్మీ చీఫ్ ఈ మేరకు స్పందించారు.