Nepal News : ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖాట్మాండు వెళ్తున్న బస్సు మర్స్యాంగ్డి నదిలో పడి  బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 40 మంది భారతీయులు గల్లంతు అయ్యారు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు.. ఈ ప్రమాదం నేపాల్‌లోని తనాహున్‌ జిల్లా మర్స్యాంగ్డిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫోఖరా నుంచి ఖాట్మాండు వెళ్తున్న  UP FT 7623 నంబర్ ప్లేట్ ఉన్న బస్సు నదిలో పడిపోయిందని స్థానిక పోలీసు అధికారులు చెప్పారు. నేపాల్‌లో కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సందర్భంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ట్రావెల్స్‌ బస్సు ఒకటి శుక్రవారం నేపాల్లోని ఫోకరా నుంచి ఖాట్మాండు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  అయితే, కొండ ప్రదేశాల్లో బస్సు అదుపు తప్పింది. దీంతో ఆ బస్సు నదిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. ఆ బస్సులో దాదాపు 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, రిస్క్యూ టీమ్‌ వారు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


ఇదీ చదవండి: కృష్ణాష్టమి బ్యాంకులకు సెలవు ఉంటుందా? పనిచేస్తాయా? ముందుగానే తెలుసుకోండి..


ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను వెలికి తీశారు. చాలామంది నేపాల్‌ సుందర దృశ్యాలను వీక్షించడానికి టూరిస్టులు ఇష్టపడతారు. అందుకే ఇతర టూరిస్టు ప్రాంతాలకు వెళ్లేటప్పుడు నేపాల్ గుండా వెళ్తే కచ్చితంగా ఫోఖరాను సందర్శిస్తారు. ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికి తీయగా మరో 16 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడ భారీవర్షలు కూడా కురవడంతో సహాయక చర్యలకు సైతం ఆటంకం ఏర్పడుతోంది. ఈ ఘటనలో బస్సు నుజ్జునుజ్జయింది. ఫోఖరా అంటే ఎక్కువ మంది భారత టూరిస్టులు సందర్శిస్తారు. మన కశ్మీర్‌ను తలపించే సుందర దృశ్యాలు అక్కడ కనువిందు చేస్తాయి. ఈ టూరిస్టులంతా ఏ ప్రాంతానికి చెందినవారు అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 


ఇదీ చదవండి: తల్లి డ్యాన్సర్‌.. తండ్రి స్టార్‌ క్రికెటర్‌.. ఆసక్తికరమైన సనా గంగూలీ ఎంచుకున్న కెరీర్‌ ఏంటో తెలుసా?


 




 


 


 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.