దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి, భారీ కోవిడ్19 మరణాలకు కారణమైన కరోనా వేరియంట్ B.1.617 వైరస్‌ను గత ఏడాది అక్టోబర్‌లో గుర్తించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా 44 దేశాలలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) తాజాగా వెల్లడించింది. తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకోకపోతే భారత్ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని అమెరికాకు చెందిన నిపుణుడు, వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డా. ఆంథోని ఫాసీ సైతం వ్యాఖ్యానించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐక్యరాజ్యసమితి ఆరోగ్య విభాగం ప్రమాదకర కరోనా వైరస్ వేరియంట్ గురించి మరిన్ని విషయాలు వెల్లడించింది. భారత్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమని భావించిన కరోనా వేరియంట్‌ను B.1.617 ప్రపంచ ఆరోగ్య సంస్థ 6 రీజియన్లలో 44 దేశాలలో గుర్తించినట్లు తెలిపింది. మరో 5 దేశాలలో ఈ వేరియంట్ ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నాయని, త్వరలో నిర్ధారణ కానుందని పేర్కొంది. ఆ వేరియంట్ ఇంకా పరివర్తనం చెంది కొత్త రకం వైరస్‌గా రూపాంతరం చెందుతుందని ప్రపంచ దేశాలను ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్‌ను బ్రిటన్, బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికాలలో మొదటగా గుర్తించారు. అయితే తరువాతి కాలంలో ఈ వేరియంట్ పలుమార్లు పరివర్తన చెంది ప్రమాదకర కరోనా వైరస్ వేరియంట్‌గా రూపాంతరం చెందినట్లు వెల్లడించింది. 


Also Read: Team India ప్లేయర్స్ కేవలం Covishield Vaccine తీసుకుంటున్నారు, కారణమేంటో తెలుసా


వైరస్‌లో వేగవంతంగా మార్పులు చోటుచేసుకున్న కారణంగానే భారత్ లాంటి దేశాలలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరిగిపోయాయని పరిస్థితి అదుపు తప్పిందని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది. ఈ వేరియంట్ కారణంగా SARS-CoV-2 వేగంగా వ్యాప్తి చెంది పలు దేశాలలో భయానక పరిస్థితులకు దారితీస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు 46 శాతం కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి.


అమెరికా తరువాత కరోనా కేసుల తీవ్రత భారత్‌లో అధికంగా ఉంది. తాజాగా సైతం గడిచిన 24 గంటల్లో 4000కు పైగా కోవిడ్19 మరణాలు సంభవించాయి. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ నిల్వలు, కరోనా వ్యాక్సిన్ డోసులు, కోవిడ్19 టెస్టింగ్ కిట్లు, ఆస్పత్రిలో కరోనా పేషెంట్లకు బెడ్లు లాంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. దేశంలో ప్రస్తుతం సగానికి పైగా రాష్ట్రాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ, పాక్షిక కర్ఫ్యూలు విధించి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. 


Also Read: Telanganaలో మందు బాబులకు సర్కార్ గుడ్ న్యూస్, మద్యం అమ్మకాలకు ఓకే 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook