Russia vs Ukraine War: రష్యా vs ఉక్రెయిన్ వార్.. భారతీయులకు హెచ్చరికలు
Indians in Ukraine: ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ దేశం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా భారతీయులను అప్రమత్తం చేసింది.
Russia vs Ukraine War: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య మరోసారి యుద్ధపూరిత వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు వీలైనంత త్వరగా దేశం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా ఉక్రెయిన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం భారతీయులను హెచ్చరించింది. ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్థులతో పాటు ఉపాధి అవకాశాల కోసం వెళ్లిన భారతీయులను ఉద్దేశించి తాజాగా అక్కడి భారత రాయబార కార్యాలయం ఈ ప్రకటన చేసింది.
ఉక్రెయిన్‌లో నాలుగు రీజియన్లను హస్తగతం చేసుకున్న రష్యా అక్కడ మార్షల్ లాను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యాలోని రీజినల్ గవర్నర్లకు ఎమర్జెన్సీ పవర్స్ ఇవ్వడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు దేశం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read : RussianPlane Crash : 9 అంతస్తుల అపార్ట్మెంట్లోకి దూసుకొచ్చిన రష్యన్ ఫైటర్ జెట్.. భారీగా ప్రాణనష్టం!
Also Read : Nigeria Floods: దశాబ్ద కాలంలో చూడని మహా వరద.. ఏకంగా 603 మంది మృతి.. నిరాశ్రయులుగా 13 లక్షల మంది!
Also Read : Pakistan Bus Fire: పాకిస్తాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 21 మంది సజీవదహనం! వరదలు వదిలేసినా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి