కశ్మీర్ లో శాంతియుత వాతావరణం దెబ్బతీసేందుకు పాక్ చేస్తున్న కుట్రలు మరోసారి వెలుగులోకి వచ్చింది. భారత సరిహద్దు ప్రాంతమైన  కెరాన్ సెక్టార్  గుండా ప్రవేశించేందుకు పాక్ కమాండోలు విఫలయత్నం చేశాయి. పాకిస్తాన్ జెండాతో ఐదుగురు కమాండోలు భారత్ లోకి ప్రవేశిస్తుండగా ఈ దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. ఆగస్టు తొలి వారంలో కెరాన్ సెక్టార్ ద్వారా భారత్ లోకి చొరబాటుకు ఆ దేశ కమాండోలు యత్నిస్తుండగా.. అదే సమయంలో అప్రమత్తంగా ఉన్న భారత బలగాలు.. ఐదుగురు పాక్ కమాండోలను హతమార్చారు. దానికి సంబంధించిన వీడియోను భారత సైన్యం సోమవారం విడుదల చేసింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోతున్న పాక్...అంతర్జాతీయ వేదికలపై విఫలమౌతోంది. దీంతో ఈ విషయంలో ఏం చేయాలో తెలియక ఇమ్రాన్ సర్కార్ దిక్కుతోచని స్థితిలో నిలిచింది. ఏదో రకంగా కశ్లీర్ లో శాంతియుతవాతావరణం దెబ్బతీయాలనే ఉద్దేశంతో సరిహద్దుల గుండా ఉగ్రవాదులను ఉసిగొల్పుతోంది.  ఇది చాలదన్నట్లు ఏకంగా తన  సైన్యాన్ని రంగంలోకి దించి ఇలా కుట్రలకు పాల్పడుతోంది. అయితే భారత్ పై దాడి చేయాలన్న పాక్ కుట్రలను భగ్రం చేసేందుకు సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద మన సైన్యం గట్టిగా నిఘా పెట్టి పాక్ కుట్రలకు చెక్ పెడుతోంది.