Indian vaccines: కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. ఆ రెండు వ్యాక్సిన్‌లు లేకుంటే భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండేదని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత వ్యాక్సిన్‌లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచాన్ని గజగజవణికించిన కరోనా వైరస్(Corona virus)నియంత్రణకు వ్యాక్సిన్ కనిపెట్టడంలో భారత్ పాత్ర కీలకంగా మారింది. అమెరికాలోని ప్రముఖ కంపెనీలు ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ,ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లతో పాటు ఇండియాకు చెందిన రెండు వ్యాక్సిన్లు కీలకంగా మారాయి. ఆక్స్‌ఫర్డ్ (Oxford)సహకారంతో సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum Institute) అభివృద్ధి చేసిన కోవిషీల్డ్(Covishield), భారత్ బయోటెక్ సంస్థ(Bharat Biotech) అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్(Covaxin). ప్రస్తుతం ఇండియాలో రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. మరోవైపు ఇండియా నుంచి కోవిషీల్డ్ , కోవ్యాగ్జిన్‌లు ప్రపంచదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 


ఈ నేపధ్యంలో అమెరికా శాస్త్రవేత్త, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ డీన్ డాక్టర్ పీటర్ హోటెజ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. భారతదేశం తయారు చేసిన కోవిషీల్డ్(Covishield), కోవ్యాగ్జిన్(Covaxin) ‌లు ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రాణనష్టం సంభవించే ప్రమాదం నుంచి కాపాడాయని అన్నారు. డీజీసీఏ (DGCA)అనుమతి పొందిన ఆ రెండు వ్యాక్సిన్ల పనితీరు చాలా మెరుగ్గా ఉందని..అన్ని వయస్సుల వారిపై ఈ వ్యాక్సిన్‌ల పనితీరు సమానంగా ఉందని తెలిపారు. అందుకే ప్రపంచదేశాలన్నీ భారత వ్యాక్సిన్‌ల వైపు మొగ్గు చూపుతున్నాయన్నారు. వ్యాక్సిన్ తయారీ విషయంలో ఇండియాను తక్కువగా అంచనా వేయవద్దని సూచించారు. కోవిడ్ 19 వ్యాక్సినేషన్(Covid19 vaccination)వెబినార్‌లో ఆయన భారత వ్యాక్సిన్లపై ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ తయారీలో ఇండియా పాత్రను కీర్తించారు. వ్యాక్సిన్‌ను అందుబాటులో తీసుకొచ్చి ఇండియా ప్రపంచానికి పెద్ద బహుమతే ఇచ్చిందన్నారు. భారత్ వ్యాక్సిన్‌పై అమెరికా శాస్త్రవేత్తలు ప్రశంసించడం విశేషమే.


Also read: Historical Bowl: ఆరు శతాబ్దాల నాటి బౌల్ వేలానికి సిద్ధం, ధర ఎంతో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook