India's Harnaaz Kaur Sandhu won prestigious Miss Universe pageant 2021: మిస్‌ యూనివర్స్‌ (Miss Universe) కిరీటాన్ని భారత (India) యువతి హర్నాజ్‌ కౌర్ సంధు (Harnaaz Kaur Sandhu) కైవసం చేసుకున్నారు. ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరంలో జరిగిన 70వ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో మొత్తం 80 మంది పోటీపడగా.. హర్నాజ్‌ సంధు విజేతగా నిలిచారు. దాంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కింది. చివరిసారిగా 2000లో ఈ టైటిల్‌ను బాలీవుడ్ హీరోయిన్ లారా దత్తా (Lara Dutta) దక్కించుకున్న విషయం తెలిసిందే. హర్నాజ్‌ సంధు ఇటీవలే 'లివా మిస్‌ దివా యూనివర్స్‌'గా కూడా నిలిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంఢీఘర్‌ (Chandigarh)లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో హర్నాజ్‌ కౌర్‌ సంధు (Harnaaz Kaur Sandhu) జన్మించారు. అక్కడి శివాలిక్‌ పబ్లిక్‌ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసిన ఆమె.. ఆపై ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిగ్రీ చేశారు. ప్రస్తుతం హర్నాజ్‌ సంధు పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నారు. హర్నాజ్‌ చిన్నప్పటి నుంచి యోగా చేయడమే కాకుండా.. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. వీటితో పాటు ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్‌, గుర్రపు స్వారీ కూడా చేస్తారు. ఖాళీ సమయం దొరినప్పుడల్లా వీటిలో ఏదో ఒకదానితో బిజీగా ఉంటారు.


Also Read: Gold Price Today: దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా


21 ఏళ్ల హర్నాజ్‌ కౌర్‌ సంధు (Harnaaz Kaur Sandhu)కు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే బలమైన కోరిక ఉండేది. అందుకే 17 ఏళ్లకే మోడలింగ్‌ (Modeling)లో అడుగుపెట్టారు. కాలేజీలో స్టేజ్‌ ప్రదర్శనతో తన మోడలింగ్‌ కెరీర్ ఆరంభించారు. ఒకపక్క మోడలింగ్‌ చేస్తూనే.. మరోవైపు ఫ్యాషన్‌ షోలలో పాల్గొనేవారు. హిందీ, పంజాబీ, ఇంగ్లిష్‌ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన హర్నాజ్‌.. తన అందం, అభినయంతో 2017లో 'మిస్‌ చంఢీఘర్‌' కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. దాంతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. హర్నాజ్‌ సంధు నటించిన 'బాయి జీ కుట్టాంగే', 'యారా దియా పూబరన్‌' అనే పంజాబీ సినిమాలు (Punjabi Movies) వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 


Also Read: Ashes Jewellery: అక్కడ అస్థికలతో ఆభరణాల తయారీ, ఫుల్ డిమాండ్ కూడా, కారణమిదే




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి