Premarital Matters: ఆ దేశంలో పెళ్లికి ముందు శృంగారంపై నిషేధం !!
Indonesia New Rules Bill: ఇండోనేషియా తీసుకొస్తున్న కొత్త చట్టాల ప్రకారం ఇకపై ఆ దేశ అధ్యక్షుడిని విమర్శించే వారు, దేశ భావజాలాన్ని విమర్శించే వారు, అలాగే జాతీయ సంస్థలపై ఇష్టం వచ్చినట్టు నోరుపారేసుకునే వారు, పెళ్లికి ముందు లైంగిక సంబంధాలు కలిగి ఉండే వారు శిక్షార్హులే అవుతారు.
Indonesia New Rules Bill: కొన్ని పద్ధతులు, ఆచార వ్యవహారాలు, సంస్కృతుల విషయంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన చట్టాలు, నిబంధనలు ఉంటాయనే విషయం తెలిసిందే. అలాగే ఇండోనేషియా కూడా తమ పాత చట్టాల దుమ్ము దులిపి వాటి స్థానంలో కొత్త చట్టాలు తీసుకురావాలనుకుంటోంది. ఇండోనేషియా తీసుకొస్తున్న కొత్త చట్టాల ప్రకారం ఆ దేశంలో ఇక పెళ్లికి ముందు శృంగారం నేరం కానుంది. అవును.. పెళ్లికి ముందు సహజీవనం చేసే అవకాశం లేకుండా ఇండోనేషియా కొత్త క్రిమినల్ కోడ్ తీసుకొస్తోంది.
ఇండోనేషియా తీసుకొస్తున్న కొత్త చట్టాల ప్రకారం ఇకపై ఆ దేశ అధ్యక్షుడిని విమర్శించే వారు, దేశ భావజాలాన్ని విమర్శించే వారు, అలాగే జాతీయ సంస్థలపై ఇష్టం వచ్చినట్టు నోరుపారేసుకునే వారు కూడా శిక్షార్హులే అవుతారు. డిసెంబర్ 15న ఈ కొత్త చట్టం బిల్లు ఇండోనేషియా పార్లమెంటులో ఓటింగ్ కి రానుంది. ఈ బిల్లు కానీ పాస్ అయితే, ఇకపై పెళ్లి కాకుండా లైంగిక సంబంధాలు కలిగి ఉండటం ఇండోనేషియాలో నేరమే అవుతుంది.
ఇండోనేషియా న్యాయ శాఖ సహాయ మంత్రి ఎడ్వర్డ్ షరీఫ్ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తో మాట్లాడుతూ.. ఇండోనేషియా విలువలు, సంప్రదాయలకు అనుగుణంగా ఉండే చట్టాలు తీసుకొస్తుండటం ఎంతో ఆనందంగా, గర్వంగానూ ఉందని అన్నారు. ఇండోనేషియా పౌరులతో పాటు ఇక్కడికి వచ్చే విదేశీయులకు కూడా ఈ చట్టాలు వర్తిస్తాయని ఎడ్వర్డ్ షరీఫ్ స్పష్టంచేశారు.
ఇదిలావుంటే, ఇండోనేషియాలో పర్యాటక రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో పాటు అధిక ఆదాయం ఇచ్చే వాటిలో పర్యాటకం కూడా ఉండటంతో ఈ కొత్త చట్టాలు ఇండోనేషియాలో వాణిజ్యంపై ప్రభావం చూపిస్తాయేమో అని వ్యాపార వర్దాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
ఇస్లామిక్ వాదం ఎక్కువగా ఉండే ఇండోనేషియాలో ఈ కొత్త చట్టాలకు కొన్ని ఇస్లామిక్ సంస్థల మద్దతు బలంగా ఉంది. అయితే, ఇంకొంతమంది మాత్రం ఈ బిల్లును బలంగా వ్యతిరేకిస్తున్నారు. సంప్రదాయ పోకడల పేరుతో పౌరుల స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేసేందుకు కుట్ర జరుగుతోందని ఈ బిల్లును వ్యతిరేకించే వారు వాదిస్తున్నారు. 1998 లో సుహార్తో నిరంకుశ పాలన అనంతరం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న ఇండోనేషియన్ల స్వేచ్ఛకు మరోసారి భంగం కలిగించడమే అవుతుంది అనేది సదరు వర్గం వినిపిస్తోన్న వాదన.
వాస్తవానికి 2019 లోనే ఇండోనేషియా సర్కారు ఈ బిల్లును తెరపైకి తీసుకొచ్చినప్పటికీ.. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా పదుల వేల సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగడంతో ప్రభుత్వానికి వెనక్కి తగ్గక తప్పలేదు. భారీ ఎత్తున ఆందోళనల మధ్య అప్పట్లో అలా అటకెక్కిన ఈ బిల్లును ఇండోనేషియా ( Indonesia ) ప్రభుత్వం మరోసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈసారి ఎలాగైనా ఇస్లాం మత సంస్థల పెద్దల మద్దతుతో ఈ బిల్లుకు ఆమోదం పొందాలని సర్కారు ప్లాన్ చేస్తోంది. అయితే, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే ఈ బిల్లును అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కూడా అంతే పట్టుదలతో ఉన్నాయి. మరి ఈ బిల్లు ఆమోదం పొందనుందా లేదా అనేది తెలియాలంటే మరో రెండు వారాలు వేచిచూడాల్సిందే.
Also Read : Iyan Griggs: వామ్మో.. టాటూలకే రూ.29 లక్షలు ఖర్చు చేసిన ఘనుడు..!
Also Read : China-America: భారత్‌తో సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్
Also Read : Man Tiger Mosquito Bite: దోమ కాటుతో కోమాలోకి.. 30 శస్త్రచికిత్సలు! బతికుండగానే నరకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook