Flights to Maldives, Germany and Canada: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో భారత్ నుంచి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించిన పలు దేశాలు ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ ఆంక్షలను సడలిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా మాల్దీవ్స్, జర్మనీ, కెనడా దేశాలు భారతీయులకు స్వాగతం పలుకుతూ భారత్ నుండి విమానాల రాకపోకలపై (Flights to Maldives, Germany and Canada from India) ఆంక్షలు ఎత్తివేశాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రావెల్, టూరిజం, హాలీడే డెస్టినేషన్‌గా పేరున్న మాల్దీవులు భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌లో (Corona second wave) ఉన్న సమయంలో భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధించింది. అయితే, మాల్దీవులకు అత్యధిక ఆధాయం లభించేది టూరిజం నుంచే కావడం, అందులోనూ మాల్దీవులను సందర్శించే పర్యాటకులలో అత్యధిక సంఖ్యలో భారతీయులే ఉండటంతో తాజాగా భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గిన నేపథ్యంలో భారత్ నుంచి రాకపోకలపై మాల్దీవ్స్ (Maldives flights) ఆంక్షలు ఎత్తివేసింది.


Also read : India Corona Cases: ఇండియాలో మళ్లీ పెరిగిన కోవిడ్19 మరణాలు, వ్యాక్సినేషన్ మరింత వేగవంతం


కెనడా సైతం భారత్ నుంచి వచ్చే వారిలో రెండు డోసులు తీసుకున్న వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తోంది. జూలై 5 నుంచే ఈ సడలింపులు అమలులోకి వచ్చాయి. భారత్ నుంచి ఉన్నత చదువుల (Higher studies in Canada) కోసం కెనడా వెళ్లే స్టూడెంట్స్ సంఖ్య అత్యధికంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. 


భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉన్న దశలో భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించిన జర్మనీ తాజాగా భారతీయులకు స్వాగతం పలుకుతూ విమానాల రాకపోకలకు అనుమతించింది. భారత్‌తో పాటు నేపాల్, రష్యా, పోర్చుగల్, యునైటెడ్ కింగ్‌డమ్‌ (India, Nepal, Russia, Portugal, and the United Kingdom) నుంచి వచ్చే వారిని జర్మనీ తమ దేశంలోకి అనుమతిస్తోంది.  భారత్‌లో కరోనా సెకండ్ వేవ్, డెల్టా వేరియంట్ కేసుల (Corona second wave, Delta variant cases) ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పలు దేశాలు భారతీయులను తిరిగి తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి.


Also read: Zika Virus cases: కేరళలో జికా వైరస్.. థర్డ్ వేవ్ రాకముందే మరో వైరస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook