iPhone X exploded in scientist's pocket: తన జేబులో iPhone X పేలిన ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఆపిల్‌పై కేసు వేశాడు. 2019లో జరిగిన ఈ ఘటనలో అతని శరీరానికి కాలిన గాయాలయ్యాయి. స్థానిక మీడియా (7 న్యూస్) ప్రకారం, సైంటిస్ట్ రాబర్ట్ డి రోజ్ ఈ విషయాన్ని Apple కు నివేదించినప్పటికీ సదరు టెక్ దిగ్గజం అతడి ఫిర్యాదుపై స్పందించలేదు. రాబర్ట్ డి రోజ్ తాను కోల్పోయిన తన ఐఫోన్ X, ఆ ఐఫోన్ పేలిన కారణంగా అయిన గాయాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా యాపిల్ పై కేసు పెట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone X explosion గురించి Apple phones కంపెనీకి సమాచారం ఇవ్వడంతో పాటు తనలాంటి iPhone users కి పొంచి ఉన్న ప్రమాదం గురించి వారిని హెచ్చరించాలనే ఉద్దేశంతోనే తాను ఈ ఫిర్యాదు చేశానని బాధితుడైన సైంటిస్ట్ రాబర్ట్ డి రోజ్ చెప్పుకొచ్చాడు. 


డి రోజ్ కేసుతో పాటు, అతని కేసును వాదిస్తున్న Law firm వారు మీడియాతో మాట్లాడుతూ, తాము డి రోజ్ కేసు తరహాలోనే మరో కేసు కూడా వాదిస్తున్నామని వెల్లడించింది. Apple watch ఓవర్ హీట్ అయిన కారణంగా తన మణికట్టుకు కాలిన గాయమైందని మరో బాధితుడు తమను ఆశ్రయించాడని, అతడి కేసు కూడా తామే డీల్ చేస్తున్నామని సదరు లా ఫర్మ్ పేర్కొంది. 


Also read : AP Municpal elections 2021: మున్సిపల్ పోరులో ముగిసిన నామినేషన్ల పర్వం, ఏకగ్రీవాలివే


ఆస్ట్రేలియాలోని కౌంటీ కోర్టులో దాఖలైన ఈ రెండు వ్యాజ్యాలపై Apple iPhones వైపు నుంచి సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, కంపెనీ రెండు ఫిర్యాదులను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook