Iran Police Fire At Tehran Metro Station: ఇరాన్‌లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తుండగా.. మరోవైపు టెహ్రాన్‌లోని మెట్రో స్టేషన్‌లో ఆందోళనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపి కర్రలతో కొట్టారు. కాల్పులతో గందరగోళం నెలకొనడంతో తొక్కిసలాట జరిగింది. 22 ఏళ్ల మహ్సా అమిని మరణానికి వ్యతిరేకంగా మెట్రో స్టేషన్‌లో ప్రజలు భారీగా చేరుకుని ఆందోళన చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిజాబ్ ధరించనందుకు ఇరాన్‌లో కలకలం 


హిజాబ్ వివాదంపై గత కొన్ని రోజులుగా ఇరాన్‌లోని వివిధ నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 13న హిజాబ్ ధరించనందుకు మెహ్సా అమిని అనే అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె మూడు రోజుల తరువాత మరణించింది. దీంతో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు మొదలయ్యాయి. మహిళలు తమ హిజాబ్‌లను కాల్చడమే కాకుండా జుట్టును కత్తిరించుకోవడానికి బహిరంగంగా వీధుల్లోకి వచ్చారు.


ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లో పోలీసులకు నిరసనకారుల మధ్య అనేకసార్లు ఘర్షణలు జరిగాయి. నిరసనకారులపై భద్రతా బలగాలు చర్యలు తీసుకోవడంతో ఇరాన్‌లో ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రదర్శనల సందర్భంగా చాలా చోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. 


ముష్కరుల కాల్పుల్లో ఐదుగురు మరణం..


బుధవారం నైరుతి ఇరాన్‌లోని ఇజే సిటీలోని మార్కెట్‌లో గుర్తుతెలియని ముష్కరులు నిరసనకారులు, భద్రతా దళాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. కొంతమంది గుర్తుతెలియని ముష్కరులు బైక్‌పై వచ్చి భద్రతా బలగాలు, నిరసనకారులపై కాల్పులు జరిపారని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ సమాచారం ఇచ్చింది. అయితే దాడికి గల కారణాలు ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. దాడికి బాధ్యత వహిస్తున్న ఏ గ్రూపు ఇంకా ప్రకటించలేదు.


Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి


Also Read: Prince OTT: 'ప్రిన్స్‌' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి