Iran Warning: దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు
Iran Warning: ఇజ్రాయిల్ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. గాజాపై దాడుల్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా ముస్లిం దేశాలు ఏకమౌతుండటం కొత్త ఆందోళనకు దారి తీస్తోంది.
Iran Warning: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపధ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పశ్చిమాసియా దేశాలు ఏకమౌతున్నాయి. ముందు నుంచీ పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్న ఇజ్రాయిల్‌కు మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని ఆపకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను, ముస్లింల నుంచి ఎదురయ్యే ప్రతిఘటనను ఇక ఎవరూ అడ్డుకోలేరని ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా ఖొమైనీ హెచ్చరించారు. పాలస్తీనీయులపై జియోనిస్ట్ పాలన, నేరాలు కొనసాగితే ముస్లింల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవల్సివస్తుందని, దీనిని ఎవరూ ఎదుర్కోలేరని ఖొమైనీ స్పష్టం చేశారు. గాజాలో జరుగుతున్న దారుణాలకు జియోనిస్ట్ పాలనాధికారుల్ని విచారించాలని ఖొమైనీ డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ దురాక్రమణ ఆగకపోతే అన్ని ముస్లిం దేశాల చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా అన్ని ముస్లిం దేశాలు ఏకమౌతున్నాయి.
ఇజ్రాయిల్‌కు ప్రతిఘటనగా ఇప్పటికే ఇరాన్ దేశం మద్యప్రాచ్యం చుట్టూ సాయుధ దళాల్ని మొహరించింది. 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి ఇరాన్ పాలకులు పాలస్తీనాకు మద్దతుగా ఉన్నారు. హమాస్‌కు నిధులు, ఆయుధాలు ఇరానే సమకూర్చుతోందనేది ఇజ్రాయిల్ చేస్తున్న ఆరోపణ. తాజాగా ఈ నెల 7వ తేదీన ఇజ్రాయిల్‌పై హమాస్ చేసిన దాడిలో తమ ప్రమేయం లేదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ ఇజ్రాయిల్ దాడుల్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సివస్తుందని హెచ్చరించింది.
ఇప్పటికే సౌదీ అరేబియా ఇజ్రాయిల్‌తో అన్ని సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ పరిణామం ఇజ్రాయిల్ ఊహించనిది. తమ మద్దతు పాలస్తీనాకేనని తేల్చి చెప్పింది. అటు అమెరికా కూడా కాస్త స్వరం మార్చినట్టు కన్పిస్తోంది. గాజాపై దీర్ఘకాలం ఆధిపత్యం చెలాయించాలనుకోవడం మంచిది కాదని ఇజ్రాయిల్‌కు హితవు పలికింది.
Also read: Israel Hamas War: హమాస్ ఉగ్రవాదులను ఏరివేతకు ఇజ్రాయెల్ సైన్యం విశ్వప్రయత్నాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook