IRAN: హమాస్, హిజ్బుల్లా, ఇస్లామిక్ జిహాద్ లు తమ ముసుగు సంస్థలు కావని..అవి స్వచ్చందంగా పోరాటాలు చేస్తున్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీఖమేనీ తెలిపారు. నిన్న కొందరు ఇరాన్ సందర్శకులతో మాట్లాడుతూ ఈ  వ్యాఖ్యలు చేశారు ఖమేని. తాము నేరుగా రంగంలోకి దిగితే అసలు అలాంటి సంస్థలు అవసరమే లేదని  ఒంటరిగానే పోరాడుతామని పేర్కొన్నారు. '


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు ఎలాంటి ప్రాక్సీ ఆర్మీ అవసరం లేదు. విశ్వాసం ఉన్నందున యెమెన్ పోరాడుతుంది. హిజ్బుల్లా పోరాడుతుంది ఎందుకంటే విశ్వాసం  శక్తి దానిని యుద్ధభూమికి ఆకర్షిస్తుంది. హమాస్ (ఇస్లామిక్) జిహాద్ పోరాడుతాయి.  ఎందుకంటే వారి నమ్మకాలు అలా చేయమని వారిని బలవంతం చేస్తాయి. వారు మా ప్రాక్సీలుగా వ్యవహరించరు అని వ్యాఖ్యానించారు. 


చాలా మంది ఈ ప్రాంతంలో మేము మా పరోక్ష పోరాట సంస్థలను కోల్పోయినట్లు చెబుతున్నారని..అది తప్పు అన్నారు. ఒకరోజు మేము చర్యలు తీసుకోవడం షురూ చేస్తే మాకు పరోక్ష సంస్థల అవసరమే ఉండదని ఖమేనీ వెల్లడించారు. ఈనెల మొదట్లో సిరియాలోని రెబల్స్ మెరుపు దాడులు చేసి ఇరాన్ కు సన్నిహితుడైన అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చారు. మీరు డెమాస్కస్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరితో నేరుగా అమెరికా చర్చిస్తుంది. హయత్ తహరీర్ అల్ షామ్ సహా ఇతర గ్రూపులతో తమ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు ఇప్పటికే వాషింగ్టన్ ప్రకటించింది.


Also Read: Gold Rate Today: అదిరిపోయే వార్త అక్కో..బంగారం ధర భారీగా తగ్గింది..తులం ఎంతుందంటే?  


సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ దేశం విడిచిపారిపోయిన తర్వాత అమెరికా దౌత్యవేత్తలు ఇక్కడికి రావడం కూడా ఇదే తొలిసారి. సిరియాతో పశ్చిమ దేశాలు క్రమంగా సంబంధాలను బలోపేతం చేసుకుంటున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. 


మరోవైపు పాలస్తీనా, లెబనాన్ కు కీలక ఆయుధాలు సరఫరా చేసే మార్గమైన సిరియాపై పట్టు కోల్పోవడంలో హిజ్బుల్లా, ఇస్లామిక్ జిహాద్ వంటి సంస్థలకు ఇరాన్ నుంచి సాయం అందడం లేదు. తాజాగా ఖమేనీ సిరియాపై కూడా స్పందించారు. అక్కడి యువత కొత్త గ్రూపు పాలనపై సంతోషంగా లేదని పేర్కొన్నారు. అమెరికాకు కిరాయి మూకగా పనిచేసే ఏ గ్రూపునైనా తాము కాళ్లకింద వేసి తొక్కి నలిపివేస్తామంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. 


Also Read: Year End 2024 IPOs: అదరగొట్టిన ఐపీఓలు..ఇన్వెస్టర్ల నుంచి అదిరే రెస్పాన్స్..90 సంస్థల నుంచి లక్షల కోట్ల నిధుల సేకరణ  


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.