Iraq: ఇరాక్‌లో ఉగ్రదాడి.. 11 మంది మృతి, ఆరుగురికి గాయాలు
ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాగ్దాద్‌కు సమీపంలోని ఉండే ఓ గ్రామంపై దాడి చేసి...11 మందిని బలిగొన్నారు. వివరాల్లోకి వెళితే..
Baghdad: ఇరాక్(Iraq)లోని బాగ్దాద్(Baghdad)కు ఈశాన్యం వైపున ఉన్న గ్రామంపై ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద గ్రూపు(Islamic State extremist group)కు చెందిన ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటనలో 11 మంది పౌరులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
దియాలా ప్రావిన్స్(Diyala province)లోని బకౌబాకు ఈశాన్య భాగంలో ఉన్న అల్-రషాద్(al-Rashad)లో షియా(Shiite)లు ఎక్కువగా ఉండే గ్రామంలో ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాదులు(Islamic State group militants).. ఇంతకుముందు ఇద్దరు గ్రామస్థులును కిడ్నాప్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం గ్రామంపై దాడికి దిగినట్లు వివరించారు.
Also read: terrorists attack: అమెరికాకు పొంచి ఉన్న ఉగ్రవాదుల ముప్పు
ఈ దాడిలో మిలిటెంట్లు మిషన్ గన్లను ఉపయోగించినట్లు తెలిపిన అధికారులు.. దీనిలో బాధితులు అందరూ సాధారణ పౌరులే(People)నని స్పష్టం చేశారు.జులైలో కూడా ఇలాంటి దాడి జరిగి.. 30 మందికిపైగా మరణించారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయాలపాలయ్యారు. అదేవిధంగా జనవరిలో, ఇరాక్ రాజధానిలో రద్దీగా ఉండే మార్కెట్‌లో జంట ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కనీసం 32 మంది మరణించారు. ఆ దాడులకు ఐఎస్ కారణమని ఇరాక్ అధికారులు ఆరోపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook