Xi Jinping: చైనా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న జిన్ పింగ్, కారణం ఇదేనా..?
Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పదవి నుంచి తప్పుకుంటారా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్ లో జరిగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రతినిధుల సమావేశంలో కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.
Xi Jinping: చైనాలో కరోనా ఉదృతి తగ్గటం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ తో డ్రాగన్ కంట్రీలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఇప్పటికే చాలా నగరాల్లో లాక్ డౌన్ విధించిన అక్కడి ప్రభుత్వం... ఆంక్షలను మరింత కఠినం చేసింది. ఈ నేపథ్యంలో చైనాలో ఆర్థిక ఇబ్బందులు ఉత్పన్నమయ్యాయి. వాటిని ఎదుర్కోవడంలో ప్రస్తుత చైనా అధ్యక్షులు జిన్ పింగ్ విఫలమయ్యారని విదేశీ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కరోనా కట్టడిలో ఫెయిల్ అయ్యారంటూ ఆయన సొంత పార్టీ అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా విమర్శలు గుప్పిస్తోంది. జిన్ పింగ్ నిర్ణయాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని సీపీసీ నేతలు ఆరోపించారు. అందుకే జిన్ పింగ్ ను రాజీనామా చేయాలని పార్టీ ఆదేశించినట్టుగా కథనాలు గుప్పుమంటున్నాయి. పార్టీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం తర్వాత ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జిన్ పింగ్ స్థానంలో ప్రస్తుత ప్రీమియర్ లీ కియాంగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కెనడాకు చెందిన ఓ బ్లాగర్ తేల్చిచెప్పాడు. ఈ ఏడాది చివర్లో పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఆ తర్వాత జిన్ పింగ్ తన పదవిని వదులుకుంటారని తెలుస్తోంది.
జిన్ పింగ్ పదవిని వదులుకునేందుకు మరో కారణం ఉందని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రస్తుతం సెరెబ్రల్ ఎన్యూరిజమ్‌తో బాధపడుతున్నారు. 2021 చివర్లో హాస్పిటలైజ్ కూడా అయ్యాడు. కరోనా ప్రారంభమైనప్పటీ నుంచి విదేశీ నేతల సమావేశాలకు కూడా అందుకే దూరంగా ఉన్నాడు. ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరం కావడంతో పాటు ప్రాణాంతకమైనది కూడా. ఆపరేషన్ తో బ్లడ్ వెస్సెల్స్ ను మృదువుగా చేసి ఎన్యూరిజమ్ తగ్గించుకోవచ్చు. కానీ జిన్ పింగ్ అలా చేయకుండా చైనా సాంప్రదాయ వైద్యాన్ని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. సెరెబ్రల్ ఎన్యూరిజమ్ తో బాధపడుతున్నందుకే ఆయన అధ్యక్ష పదవిని వదులుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
కరోనాతో చైనాలో తయారీరంగం పూర్తిగా క్షీణించింది. దీంతో చైనీస్ కరెన్సీ విలువ దాదాపుగా 4శాతానికి పడిపోయింది. ఏప్రిల్ నెలలో ఇంతలా పడిపోవడం 28 సంవత్సరాల చరిత్రలో ఇదే తొలిసారని తెలుస్తోంది. నవంబర్ 2022లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రతినిధులు సమావేశం కానున్నారు. దీన్ని ప్రతి ఐదేండ్లకోసారి నిర్వహిస్తారు. ఈ సమావేశంలో భారీగా నాయకత్వ మార్పులు జరుగుతాయని అందరూ భావిస్తున్నారు.
Also Read: Warne-Symonds: ఆ యువ క్రికెటర్‌ను వార్న్, సైమండ్స్ అనరాని మాటలన్నారు.. నెలల వ్యవధిలో మృతి చెందారు!
Also Read:Covid 19 Strange Symptoms: కరోనా వైరస్ కొత్త, స్ట్రేంజ్ లక్షణాలు ఏంటో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.