Nuclear Attack: ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో ఇప్పటికే గాజా నాశనమైంది. గాజా స్ట్రిప్ పూర్తిగా ధ్వంసమైంది. వందలాదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజాపై అణుబాంబు వేసే అవకాశాలున్నాయంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖల్లో నిజమెంత, అసలేం జరిగిందనేది తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. రోజురోజుకూ యుద్ధం తీవ్రమౌతోంది. ఇజ్రాయిల్ అన్నివైపుల్నించి దాడులు కొనసాగిస్తోంది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్నా ఇజ్రాయిల్ నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది. అదే సమయంలో గాజాపై అణుబాబుం వేసే అవకాశాలు లేకపోలేదని ఆ దేశ మంత్రి ఎలియాహూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గాజా పౌరుల్ని నాజీలతో పోల్చిన ఆయన, గాజాలో ఉన్నవాళ్లంతా హమాస్ సానుభూతిపరులేనని స్పష్టం చేశారు. మానవతా సహాయానికై యుద్ధ విరామాన్ని తిరస్కరించారు. అసలు హమాస్‌తో సంబంధం లేని వ్యక్తులు గాజాలోనే లేరన్నాడు. గాజా స్ట్రిప్ మొత్తం శత్రువులే అన్నట్టుగా వ్యాఖ్యలు చేశాడు. పాలస్తీనియన్లు ఐర్లండ్ లేదా ఏ ఎడారిలోకో వెళ్లిపోవల్సిందేనన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. 


అందరూ మంత్రి ఎలియాహూ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతుండటంతో ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డారు. అదంతా వాస్తవం కాదని, ఇజ్రాయిల్ అంతర్జాతీయ నిబంధనలు, చట్టాలకు లోబడి పనిచేస్తోందన్నారు. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేసిన మంత్రిని కేబినెట్ నుంచి బహిష్కరించాలని కోరారు. దాంతో మంత్రి ఎలియాహూ తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అతడిని కేబినెట్ నుంచి నిరవధికంగా సస్పెండ్ చేశారు.


Also read: Nepal Earthquake Pics: ఎక్కడ చూసినా శిధిలాలే, భయం గొలుపుతున్న నేపాల్ భూకంపం దృశ్యాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook