ISRAEL-HAMAS WAR: కొడుకుని యుద్ధానికి పంపిస్తున్న నెతన్యాహూ, వైరల్ అవుతున్న ఫోటోలో నిజమెంత
ISRAEL-HAMAS WAR: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరరూపం దాల్చుతోంది. ఇజ్రాయిల్ ముప్పేట దాడిలో హమాస్ మిలిటెంట్లతో పాటు భారీగా సాధారణ పౌరులు చనిపోతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ కుమారుడి ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో నిజానిజాలేంటో పరిశీలిద్దాం..
ISRAEL-HAMAS WAR: ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం తీవ్రరూపం దాల్చేకొద్దీ దేశం కోసం అంటూ ఒక్కొక్కరిగా కదనరంగంలో దిగుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్ ఈ యుద్ధాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భీకరదాడి జరుగుతోంది. హమాస్ రాకెట్ దాడితో ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కన్పించడం లేదు.
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంతో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. హమాస్ కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5 వేల రాకెట్లతో ఇజ్రాయిల్‌పై విరుచుకుపడటంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. హమాస్‌ను మట్టుబెట్టే ఆలోచనతో యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయిల్ దేశంలోని రిజర్వ్ ఆర్మీని సైతం రంగంలో దించింది. అంతేకాకుండా దేశ పౌరులు చాలా మంది స్వచ్ఛంధంగా యుద్ధంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుుడు ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటో ఎంతవరకూ నిజమో పరిశీలిద్దాం..
ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ తన సొంత కుమారుడు అవ్నర్ నెతన్యాహూని దేశ సేవ కోసం యుద్ధానికి పంపిస్తున్నట్టుగా ప్రచారంలో ఉన్న ఫోటో ఇది. పోస్టులో అదే ఉండటంతో చాలామందిని ఆకర్షిస్తోంది. అందరూ నెతన్యాహూ దేశభక్తిని కొనియాడుతున్నారు. పిక్చర్ ఆఫ్ ది డే అంటూ ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏ దేశాధినేత ఇలా చేయగలడంటూ నెతన్యాహూపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశానికి మొదటి స్థానం ఇవ్వడం వల్లనే కొడుకుని యుద్ధానికి పంపిస్తున్నాడని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే నిజంగానే నెతన్యాహూ తన కుమారుడిని యుద్ధానికి పంపించారా, అసలీ ఫోటో నిజమేనా, ఈ ఫోటో ఎప్పటిదనే వివరాలు ఫ్యాక్ట్‌చెక్‌లో తేలిపోయాయి.
ఫ్యాక్ట్‌చెక్
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ ఫోటో తప్పని తేలింది. ఈ ఫోటోకు యుద్ధానికి కొడుకును పంపిస్తున్నట్టుగా ఉన్న పోస్టుకు సంబంధం లేదని తేలింది. ఎందుకంటే అసలీ ఫోటో ఇప్పటిది కానేకాదు. 2014లో తీసిన ఫోటో ఇది. అప్పట్లో నెతన్యాహూ చిన్న కుమారుడు అవ్నర్ నెతన్యాహూ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో చేరిన సమయంలో తీసిన ఫోటో అట. ఈ ఫోటోను పట్టుకుని సోషల్ మీడియాలో దేశసేవకు కుమారుడిని పంపిస్తున్నాడంటూ ఇజ్రాయిల్ వీరాభిమానులు చేసిన తప్పుడు ప్రచారమిది.
Also read: Israel Palestine War: ఇజ్రాయెల్ చేతిలో 1500 మంది ఉగ్రవాదులు హతం.. గాజా సరిహద్దుపై పూర్తి పట్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook